ETV Bharat / city

'ఈనెల 5న విశాఖలో.. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా గ్రంథాల ఆవిష్కరణ'

author img

By

Published : Nov 3, 2021, 7:23 PM IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా.. విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్​లో ఈనెల 5న రెండు గ్రంథాల ఆవిష్కరణ జరగనుందని(books release by vice president venkaiah naidu on 5th november) నవమ పీఠాధిపతి ఉమర్ అలీషా వెల్లడించారు. "ఆజాదీకా అమృత్ మహోత్సవ్​"లో భాగంగా.. ఈ కార్యక్రమం చేపట్టిన తెలిపారు.

ట్రస్ట్ నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా
ట్రస్ట్ నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా

ఆజాదీకా అమృత్ మహోత్సవ్​లో భాగంగా.. విశ్వ విజ్ఞాన విద్య అధ్యాత్మిక పీఠం(ట్రస్టు) ఆధ్వర్యంలో రెండు గ్రంథాలు అవిష్కరించనున్నట్లు ట్రస్టు​ నిర్వాహకులు తెలిపారు. ఈనెల 5న విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్​లో జరగనున్న సభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ పుస్తకాల ఆవిష్కరణ ఉంటుందని నవమ పీఠాధిపతి డా.ఉమర్ అలీషా పేర్కొన్నారు(navama trust chairman Dr. Umar Alisha on books release). ఈ మేరకు డాబా గార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్​లో మీడియా సమావేశం నిర్వహించారు.

విశ్వమానవ శ్రేయస్సు, తత్వ ప్రభోదం, సామాజిక శ్రేయస్సు కోసం ఈ పీఠం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. వేదాంతం నుంచి జాతీయ భావం వైపు(1904-1945), డిబేట్స్ ఆఫ్ డా. ఉమర్ అలీషా ఇండియన్ నేషనల్ అసెంబ్లీ(1935-1945) అనే రెండు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. సమావేశంలో ట్రస్ట్ కన్వీనర్ డా.ఆనంద్ కుమార్ పింగళి, పోగ్రాం కన్వీనర్ ప్రసాద్ వర్మ, వీరభద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

మూఢనమ్మకాలకు 11 ఏళ్ల బాలిక బలి- తండ్రి, మత గురువు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.