ETV Bharat / city

విశాఖ జిల్లాలో రెండు కార్లు ఢీ.. చెలరేగిన మంటలు

author img

By

Published : Mar 9, 2022, 12:49 PM IST

Updated : Mar 9, 2022, 1:29 PM IST

Car Burnt On Highway :
Car Burnt On Highway :

12:45 March 09

Car Burnt On Highway : విశాఖ జిల్లాలో రెండు కార్లు ఢీ.. చెలరేగిన మంటలు

విశాఖ జిల్లాలో రెండు కార్లు ఢీ.. చెలరేగిన మంటలు

Car Burnt On Highway : విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. విశాఖ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న కారును.. అదే మార్గంలో వెళ్తున్న మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ఈ ఘటనతో ఓ కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అందులోని ప్రయాణికులు బయటకు దిగటంతో.. తృటిలో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకొని మంటలార్పారు.

ఇదీ చదవండి : Boats Rally: ప్రభుత్వంపై పడవల పోరు.. వరుసకట్టిన బోట్లు!

Last Updated : Mar 9, 2022, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.