ETV Bharat / city

ఏయూ, మిస్సోరి స్టేట్​ యూనివర్సిటీల ఎంఎస్​ కోర్సు

author img

By

Published : Aug 12, 2022, 10:40 PM IST

Updated : Aug 13, 2022, 10:03 AM IST

ఏయూ అమెరికాలోని మిస్సోరి స్టేట్​ యూనివర్సిటీ సంయుక్తంగా ఎంఎస్​ కోర్సును ప్రవేశపెట్టింది. తెలుగు విద్యార్థులతో పాటు దేశంలోని విద్యార్థులు చేరేందుకు అవకాశం కల్పించారు. తొలి ఏడాది ఆన్​లైన్​లో రెండో ఏడాది యూఎస్​లో కొనసాగించే వీలుంది.

au
au

MS Project Management Course: ఆంధ్ర విశ్వవిద్యాలయం, అమెరికాలోని మిస్సోరి స్టేట్ యూనివర్సిటీ సంయుక్తంగా ఎంఎస్ కోర్సును అందుబాటులోకి తెచ్చాయి. ఎంఎస్ ప్రాజెక్ట్ మేనేజ్​మెంట్ కోర్సును తొలిసారిగా తెలుగు విద్యార్ధులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్ధులు కూడా చేరేందుకు వీలు కల్పించారు. ఇందులో భాగంగా ఎంఎస్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కోర్సును అంధ్ర విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుందని.. ఇంటర్నేషనల్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ ఇ. ఎన్. ధనుంజయరావు వెల్లడించారు. జీఆర్ఈ స్కోర్ 290 లేదా అంతకంటే ఎక్కువ సాధించి,.. తొలి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత యూఎస్ఏలో మిస్సోరి స్టేట్ యూనివర్సిటీలో రెండవ సంవత్సరం కొనసాగించేందదుకు వీలుంటుందని తెలిపారు.

పాస్‌పోర్ట్‌తో టోఫెల్​ 79, ఐఇఎల్​టిఎస్​ 6.0 లేదా డ్యులింగో 105, నాక్​ ఎ గ్రేడ్ ఇన్‌స్టిట్యూట్ నుండి డిగ్రీని అభ్యసించేందుకు వీలుంటుంది. ఇది స్టెమ్​ కోర్సు అని, యూఎస్​ఏ లో 3 సంవత్సరాల ఆప్ట్​ని పొందవచ్చునని స్పష్టం చేశారు. అభ్యర్ధి తన తొలి సంవత్సరం రుసుముగా 4700 యూఎస్​ డాలర్లు (రూ.3.6 లక్షలు), 2వ సంవత్సరం 7911 యూఎస్​ డాలర్లు (రూ. 6.1 లక్షలు) చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తులను ఆంధ్ర విశ్వవిద్యాలంయ అంతర్జాతీయ వ్యవహారాల కార్యాలయం నుండి పొందేందుకు అవకాశం కల్పించారు. ఫోన్​: 08912844434, 99666 43315 (మొబైల్) లలో సంప్రదించేందుకు వీలు కల్పించినట్లు ఆచార్య ధనుంజయ్ తెలిపారు.

ఆచార్య ధనుంజయ్
ఆచార్య ధనుంజయ్

ఇవీ చదవండి:

Last Updated :Aug 13, 2022, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.