ETV Bharat / city

మేడారంలో జెండాను చూస్తూ నడవాల్సిందే..!

author img

By

Published : Feb 6, 2020, 3:57 PM IST

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారాలమ్మ మహా జాతరకు భక్తులు పోటెత్తున్నారు. రద్దీతో కొన్నిసార్లు పలువురు తప్పిపోతుండటం జరుగుతుంది. తమ కుటుంబ సభ్యులు తప్పిపోకుండా ఉండేందుకు కొందరు రకరకాల జెండా గుర్తులను పెట్టుకుని నడుస్తున్నారు.

తప్పిపోకుండా ఉండేందుకు రకరకాల జెండా గుర్తులు
తప్పిపోకుండా ఉండేందుకు రకరకాల జెండా గుర్తులు

తప్పిపోకుండా ఉండేందుకు రకరకాల జెండా గుర్తులు

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారాలమ్మ మహా జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తుంటారు. జనజాతరకు అనేక కుటుంబాలు కలిసి మేడారం చేరుకుంటారు. కానీ ఆ జనసముద్రంలో కలసి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే మాత్రం అందరూ కలిసి వెళ్లడం మాత్రం అసాధ్యంగా మారుతోంది. ఒకవేళ వారితో నడవలేక ఎక్కడైనా ఆగినా, ఏదైనా అవసరం పడి మళ్లీ వాళ్లని ఆ జనంలో వెతకాలంటే తిప్పలే. అందుకే మేడారంలో ఎటు చూసినా రంగురంగుల జెండాలే దర్శనమిస్తున్నాయి.

దారి తప్పిపోకుండా గుర్తుగా

కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు వారిలో ఎవరూ దారి తప్పకుండా ఉండేందుకు ఓ గుర్తును పెట్టుకుంటారు. కుటుంబంలో ఒక్కరు ఓ గుర్తును కర్రకు చుట్టి ముందు నడుస్తుంటే దానిని చూసుకుంటూ అందరూ వెనుక వెళ్తారు. దీనివల్ల సులభంగా అందరూ కలసి జాతరలో తిరుగుతూ సందడి చేస్తున్నారు.

సంబంధిత కథనం:

దేవతల ఆగమనం... అట్టహాసంగా మహాజాతర ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.