ETV Bharat / city

చంద్రబాబుకు మహిళా కమిషన్​ నోటీసులు అందజేత

author img

By

Published : Apr 23, 2022, 4:38 PM IST

చంద్రబాబుకు మహిళా కమిషన్​ నోటీసులు
చంద్రబాబుకు మహిళా కమిషన్​ నోటీసులు

Women Commission Notice on vijayawada incident: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర మహిళా కమిషన్​ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు పేరుతో ఉన్న నోటీసు కాపీని తెదేపా పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బందికి అందజేసింది. అలాగే విజయవాడలో బోండా ఉమా ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చింది.

Women Commission notice to Chandrababu: తెదేపా అధినేత చంద్రబాబు పేరుతో ఉన్న నోటీసు కాపీని రాష్ట్ర మహిళా కమిషన్​ ఉద్యోగులు.. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో ఇచ్చారు. మహిళా కమిషన్ కార్యాలయంలో జరిగే విచారణకు రావాలంటూ కమిషన్​ జారీ చేసిన నోటీసులను తెదేపా కార్యాలయ సిబ్బంది తీసుకున్నారు. అలాగే.. ఈనెల 27న మహిళా కమిషన్ కార్యాలయంలో విచారణకు రావాలంటూ.. విజయవాడలో బోండా ఉమా ఇంటికి వెళ్లి స్వయంగా నోటీసులు అందచేశారు. అయితే.. నోటీసుల్లో పేర్కొన్న తేదీలపై గందరగోళాన్ని బోండా ఉమా తప్పుబట్టారు. నోటీసులపై న్యాయపరంగా ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

విజయవాడలోని ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు తనను అభ్యంతరకర పదజాలంతో దూషించారంటూ తెదేపా అధినేత చంద్రబాబు, బొండా ఉమామహేశ్వరరావులకు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని కార్యాలయంలో జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

మహిళా కమిషన్ అంటే ఏమిటో చూపిస్తాం: అత్యాచార బాధితురాలి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు అమానుషంగా వ్యవహరించారని.. అందువల్లనే చంద్రబాబుకు సమన్లు ఇచ్చినట్లు మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. అత్యాచారం ఘటనను రాజకీయం చేయడమే కాకుండా విమర్శలు చేయడం దారుణమన్నారు. మహిళా లోకానికి క్షమాపన, సంజాయిషీ ఇప్పించేందుకే కమిషన్ వద్దకు రప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27న కమిషన్ ముందు చంద్రబాబు వివరణ ఇవ్వాల్సిందేనని... లేనిపక్షంలో మహిళా కమిషన్ అంటే ఏమిటో చూపిస్తామన్నారు. నిన్నటి ఘటనపై తెలుగుదేశం నేతలకు రాజకీయం చేయాలన్న ఆరాటం తప్పా.. సిన్సియారిటీ ఎక్కడా కనిపించలేదని ఆమె విమర్శించారు. అత్యాచార బాధితుల పట్ల రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలని.. రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజలను గౌరవించడం ఏలాగో నేర్చుకోవాలని హితవు పలికారు.

ఇదీ చదవండి: విజయవాడ ప్రభుత్వాస్పత్రి దగ్గర ప్రజాసంఘాల ఆందోళన.. ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.