ETV Bharat / city

Vijayawada CP: వంగవీటి రాధాపై రెక్కీ.. విజయవాడ సీపీ ఏమన్నారంటే?

author img

By

Published : Jan 2, 2022, 10:19 PM IST

Vijayawada CP On Radha Murder Attempt Issue: విజయవాడలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా స్పష్టం చేశారు. తెదేపా నేత వంగవీటి రాధాపై హత్యాయత్నానికి రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలూ లేవన్నారు. రెక్కీ అంటూ అవాస్తవాలు ప్రచారం చేయవద్దని.. ఈ అంశంపై పోలీసులతోపాటు రాష్ట్ర స్థాయి ఏజెన్సీలూ దర్యాప్తు చేస్తున్నాయన్నారు.

రాధాపై హత్యాయత్నానికి రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు
రాధాపై హత్యాయత్నానికి రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు

రాధాపై హత్యాయత్నానికి రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు

Vijayawada CP On Vangaveeti Radha Murder Attempt Issue: తెదేపా నేత వంగవీటి రాధాపై హత్యాయత్నానికి రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. విజయవాడలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్న సీపీ.. పోలీసు అధికారులు రాధాతో మాట్లాడారన్నారు. రాధాకు భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన ఇచ్చిన సమాచారం తీసుకున్నామని.. ఈ ఘటనపై ఎలాంటి అ వాస్తవాలు ప్రసారం చేయొద్దని కోరారు. అన్ని కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతోందన్న సీపీ.. నేరం, నేర ఘటన లేకుండా జీరో ఎఫ్‌ఐఆర్ ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతుందని.. సీసీ ఫుటేజ్​ని పరిశీలిస్తున్నామని అన్నారు. పోలీసులతోపాటు రాష్ట్రస్థాయి ఏజెన్సీలు కూడా దర్యాప్తు చేస్తున్నాయన్నారు.

"వంగవీటి రాధాతో పోలీసు అధికారులు మాట్లాడారు. రాధాపై రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు. వంగవీటి రాధాకు భద్రత ఏర్పాటు చేస్తామన్నాం. రాధా ఇచ్చిన సమాచారం తీసుకున్నాం. రెక్కీ అంటూ అవాస్తవాలు ప్రచారం చేయవద్దు. సీసీ ఫుటేజ్ పరిశీలన సహా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం. నేరం, నేర ఘటన లేకుండా జీరో ఎఫ్‌ఐఆర్ ఎలా నమోదు చేస్తారు ? పోలీసులతో పాటు రాష్ట్ర స్థాయి ఏజెన్సీలూ దర్యాప్తు చేస్తున్నాయి." -కాంతి రాణా టాటా, విజయవాడ సీపీ

నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు: రాధా
కొందరు తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని.. తెదేపా నేత వంగవీటి రాధా ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. చంపాలని చూసినా భయపడేది లేదన్న ఆయన.. దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని తేల్చిచెప్పారు. వంగవీటి రంగా కీర్తి, ఆశయాల సాధనే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

"నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు. నన్ను చంపాలని చూసినా భయపడను, దేనికైనా సిద్ధం. నేను ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటా. వంగవీటి రంగా కీర్తి, ఆశయాల సాధనే లక్ష్యం" - వంగవీటి రాధా, తెలుగుదేశం పార్టీ నేత

రాధా భద్రతకు సీఎం ఆదేశం..

దీంతో వంగవీటి రాధాకు 2 ప్లస్‌ 2 గన్‌మెన్లు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులు ఆదేశించారు. కాగా..తనకు గన్​మెన్ల్​ వద్దని రాధా స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తినిని అందుకే గన్​మెన్ల్​ వద్దన్నానని తెలిపారు. తన క్షేమంపై అన్ని పార్టీల నేతలు ఫోన్ చేసి అడిగారన్నారు.

రాధాపై హత్యాయత్నానికి ఆధారాలున్నా చర్యల్లేవు: చంద్రబాబు
వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు ఆధారాలున్నా ప్రభుత్వం, పోలీసులు ఎందుకు స్పందించట్లేదని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల్లో విశ్వసనీయత పెరిగేలా పోలీసుల దర్యాప్తు ఉండాలని, దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాధా హత్యకు రెక్కీపై పోలీసుల దర్యాప్తు దోషులను రక్షించేలా ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఆధారాలున్నా.. కావాలనే కాలయాపన చేస్తున్నారని ఆక్షేపించారు. తన హత్యకు రెక్కీ జరిగిందని ఇటీవల రాధా సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాడేపల్లిలో వంగవీటి రాధా నివాసానికి చంద్రబాబు శనివారం వెళ్లి పరామర్శించారు.

ఇదీ చదవండి :

CBN On Statue Issue: కులాల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.