ETV Bharat / city

KCR At TRS Plenary: 'తెరాస.. తెలంగాణ కంచుకోట.. రాష్ట్ర ప్రజల ఆస్తి'

author img

By

Published : Apr 27, 2022, 2:15 PM IST

KCR At TRS Plenary : దేశంలో చాలా రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని తెరాస పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్నో రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెరాస సాధించిన ఈ విజయాల వెనుక ఎందరో మహానుభావులు, పార్టీ శ్రేణుల కష్టముందని కేసీఆర్ వెల్లడించారు. ఎన్నో సంక్షేమ పథకాలు.. మరెన్నో వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పనిచేయడం లేదని అన్నారు.

KCR At TRS Plenary
తెరాస ప్లీనరీలో కేసీఆర్

తెరాస ప్లీనరీలో కేసీఆర్

KCR At TRS Plenary : ఇరవై ఒక్క ఏళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటోంది. ప్లీనరీ వేదికను చేరుకున్న గులాబీ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ ప్లీనరీలో సుమారు 3వేలు పైగా తెరాస ప్రతినిధులు పాల్గొన్నారు. గులాబీ నేత కె.కేశవరావు స్వాగత ఉపన్యాసంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని ఉద్దేశించి ప్రసంగించారు.

KCR At TRS 21st Plenary : అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. నిబ‌ద్ధమైన, సువ్యవ‌స్థీత‌మై కొలువుదీరిన పార్టీ తెరాస అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట‌ అనీ... ఎవ‌రూ కూడా బ‌ద్దలు కొట్టలేని కంచుకోట అని స్పష్టం చేశారు. ఇది ఒక వ్యక్తిదో, శ‌క్తిదో కాదన్న సీఎం... తెలంగాణ ప్రజ‌ల ఆస్తి అని వెల్లడించారు.

KCR At TRS Plenary 2022 : రాష్ట్ర సాధనలో అనేక ఒడుదొడుకులు, అవమానాలు ఎదుర్కొన్నామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్నో ఛాత్కారాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. దేశానికి రోల్ మోడల్‌గా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అనేక ప‌ద్ధతుల్లో వెలువ‌రిస్తున్న ఫ‌లితాలు, అవార్డులు, రివార్డులే మ‌న ప‌నితీరుకు మ‌చ్చుతున‌క అని ఆయన పేర్కొన్నారు. నిన్న విడుద‌ల చేసిన ప్రక‌ట‌న‌లో దేశంలో అతి ఉత్తత‌మ 10 గ్రామాలు తెలంగాణ‌వే నిలిచాయని తెలిపారు.

గొప్పలు కాదు.. వాస్తవాలు : "అవినీతి రహితంగా, చిత్తశుద్ధితో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. పాలమూరు- రంగారెడ్డిని పూర్తి చేసుకుంటే మరింత సస్యశ్యామలం. అంకితభావంతో పనిచేసినందుకే రాష్ట్రంలో నేడు విద్యుత్‌ సమస్య లేదు. ఎందరో మహానుభావులు, పార్టీ శ్రేణుల కష్టమే తెరాసకు ఈ విజయాలు. కర్ణాటకలో అవినీతికి పాల్పడి ఒకరు మంత్రి పదవి కోల్పోయారు. కర్ణాటక తరహా పరిస్థితి తెలంగాణలో లేదు. పలు పెద్ద రాష్ట్రాలను అధిగమించి మన తలసాని ఆదాయం రూ.2,78,000. జీరో ఫ్లోరైడ్‌ రాష్ట్రంగా తెలంగాణను నిలిపాం. తెలంగాణ తలసరి ఆదాయాన్ని రెట్టింపు కంటే ఎక్కువగా చేసుకున్నాం. ఒకప్పుడు 3 ప్రభుత్వ వైద్యశాలలుంటే ఇప్పుడు 33 వైద్యకళాశాలలు ఏర్పాటు చేసుకున్నాం. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ కూడా ఇచ్చాం. ఉద్యోగ సాధన కోసం నిరుద్యోగులంతా తలమునకలుగా కష్టపడుతున్నారు. తెరాస ప్రభుత్వ స్థాయిలో కేంద్రం పనిచేసి ఉంటే మన స్థాయి రూ.14.50 లక్షలు ఉండేది. మన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పనిచేయడం లేదు. గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం."

- కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.