ETV Bharat / city

మద్యం దుకాణాల్లో పనికి పీహెచ్‌డీ అభ్యర్థి దరఖాస్తు!

author img

By

Published : Sep 19, 2019, 9:52 AM IST

ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే మద్యం దుకాణంలో పనిచేసేందుకు ఉన్నత విద్యావంతులు క్యూ కడుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో దాదాపు బీటెక్, మేనేజ్​మెంట్ అభ్యర్థుల విద్యార్హతలు చూసి అధికారులు నివ్వెరపోతున్నారు.

మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు..పోటీగా ఉన్నత విద్యావంతులు

మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు..పోటీగా ఉన్నత విద్యావంతులు

ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు ఉన్నత విద్యావంతులు పోటీపడుతున్నారు. కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు ఎంబీఎ, ఇంజినీరింగ్ చదివిన వారు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ముఖాముఖి పరీక్షలో వీరి విద్యార్హతలు చూసి ఎంపిక కమిటీ సభ్యులే ఆశ్చర్యపోతున్నారు. జిల్లాలో 344 మద్యం దుకాణాలు ఉన్నాయి. దుకాణాల్లో మద్యం విక్రయించేందుకు ఇంటర్ విద్యార్హత...సూపర్‌వైజర్ పోస్టులకు బీకాం విద్యార్హతగా ప్రభుత్వం నిర్దేశించింది. కానీ ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో దాదాపు 20 శాతం మంది ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్నవారే కావడం విశేషం. ఓ దుకాణంలో పనిచేసేందుకు ఏకంగా పీహెచ్​డీ చేసిన అభ్యర్థి దరఖాస్తు చేయగా...విద్యార్హతలు ఎక్కువగా ఉన్నాయని ఎంపిక కమిటీ అతణ్ని తిరస్కరించింది. మద్యం విక్రయించే పోస్టులకు స్థానికులకే ప్రాధాన్యమివ్వగా...సూపర్‌వైజర్లగా మండలంలో ఉన్నవారికి అవకాశం కల్పించారు.

ఇదీ చదవండి:'మెరుగైన ఫీజు రియంబర్స్ మెంట్ పథకం తెస్తాం'

Intro:కేంద్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల మిషన్ కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాన్ని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు లో ప్రారంభించారు. జిల్లాలో 100 వంద గ్రామాలను ఎంపిక చేసి ఒక గ్రామంలో రెండు వందల పశువులకు 600 కృత్రిమ గర్భధారణ మేలుజాతి ఇంజక్షన్లు ఉచితంగా పశువులకు చాలా మంచి పరిణామమని ఎమ్మెల్యే అన్నారు . మేలుజాతి ఇంజక్షన్లు చేయడం వలన మేలు జాతి పశువులు పడతాయని దీంతో జిల్లాలో పాల దిగుబడి పెరుగుతుందని దీంతో పాడి రైతులు అభివృద్ధి చెందుతారని ఎమ్మెల్యే అన్నారు. ఆరు నెలల్లో జిల్లాలో 20 వేలు మేలు జాతి పశువులు చేకూరతాయి అన్నారు . ఈ అవకాశాన్ని జిల్లాలోని పాడి రైతులు ఉపయోగించుకోవాలి అని ఆయన కోరారు.
బైట్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీBody:రాష్ట్రీయ గోకుల్ మిషన్Conclusion:బి రాజా నెల్లూరు. 9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.