ETV Bharat / city

కాలిపోయిన మూడు ఎస్​ఎల్​ఆర్​ తుపాకులు.. అక్కడ ఎందుకు వదిలేశారన్న దానిపై పలు అనుమానాలు..!

author img

By

Published : May 26, 2022, 7:43 AM IST

GUNS
కాలిపోయిన మూడు ఎస్​ఎల్​ఆర్​ తుపాకులు

GUNS: అమలాపురం ఘటనకు సంబంధించి మంత్రి పినిపే విశ్వరూప్ నివాసం వద్ద కాలిపోయిన ఆయుధాల విషయంలో సందేహాలు రేగుతున్నాయి. మూడు ఎస్​ఎల్​ఆర్ తుపాకులు ఈ ఘటనలో కాలిపోయాయి. పూర్తిగా మంటల్లో దగ్ధం అయ్యేలా అక్కడ ఎందుకు అక్కడ వదిలేశారనే అంశంపైన అనుమానాలు తలెత్తుతున్నాయి.

GUNS: అమలాపురం ఘటనలో మంత్రి పినిపే విశ్వరూప్ నివాసం వద్ద పోలీసులకు చెందిన మూడు ఎస్​ఎల్​ఆర్​ (SLR) తుపాకులు కాలిపోయాయి. మంటల్లో దగ్ధం అయ్యేలా అక్కడ ఎందుకు అక్కడ వదిలేశారనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అమలాపురంలో జరిగిన విధ్వంసంలో పోలీసుల ఆయుధాలు కొన్ని దహనమయ్యాయి. మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించటంతో ఆ మంటల్లో భద్రతా సిబ్బందికి సంబంధించిన 2తుపాకులు పూర్తిగా, మరో తుపాకీ పాక్షికంగా కాలిపోయాయి. ఘటన జరిగిన ఆ సమయంలో వాటిని అక్కడ ఎందుకు వదిలేశారన్న అంశంపై సమాధానం రావడంలేదు. ప్రస్తుతం ఘటనకు సంబంధించి అంతర్గతంగా విచారణ జరుపుతున్న పోలీసులు అసలు అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఎందుకు తుపాకులు వదిలేశారన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.

కాలిపోయిన మూడు ఎస్​ఎల్​ఆర్​ తుపాకులు

మంత్రి నివాసం వద్ద రక్షణ విధుల్లో ఉండాల్సిన నలుగురు కానిస్టేబుళ్లలో ఒకరు మాత్రమే ఆ సమయంలో విధుల్లో ఉండడం ఆందోళనకారులు మంత్రి నివాసానికి నిప్పుపెట్టిన సమయంలో విధుల్లో ఉన్న ఒక్క కానిస్టేబుల్ మంత్రి కుటుంబ సభ్యుల్ని కాపాడేందుకు పై అంతస్తుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే మిగతా వారు ఆయుధాలు విడిచిపెట్టి ఎక్కడికెళ్లారనే దానిపై సందేహాలు రేగుతున్నాయి. విధుల్లో ఉన్న సమయంలో అప్పగించిన ఆయుధాలను వీడి ఉండేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ నిబంధనలు అనుమతించవు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఆయుధాన్ని తమతో పాటే ఉంచుకోవాలి. కానీ అమలాపురం ఘటనలో ఆయుధాలు అక్కడే వదిలేసి వెళ్లడం సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతోంది.

మంత్రి నివాసానికి నిప్పంటించిన సమయంలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరు పై అంతస్తుకు పరిగెత్తి మంత్రి సతీమణితో పాటు మొత్తం ఆ సమయంలో నివాసంలో ఉన్న 6గురిని సురక్షితంగా తీసుకువచ్చారు. అయితే పెట్రోల్ సీసాలు విసిరిన కారణంగా కింది అంతస్తుల్లో ఉన్న ఫర్నిచర్ తగలబడి పోయింది. మంత్రి సతీమణితో పాటు మిగతావారిని కూడా..కిందకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఆ ఆయుధాలను తీసుకోలేక పోయినట్లు తెలుస్తోంది.



ఇవీ చదవండి:


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.