ETV Bharat / city

Employees salaries: ట్రెజరీ సర్వర్‌లో సమస్యలు.. కొత్త జీతాలు చెల్లించేలా సర్కారు యత్నం

author img

By

Published : Jan 28, 2022, 10:03 PM IST

Employees salaries in AP: ఉద్యోగుల జీతాల బిల్లులకు సంబంధించిన ట్రెజరీ సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తినప్పటికీ.. కొత్త జీతాలు చెల్లించేలా రాష్ట్ర సర్కారు యత్నిస్తోంది. శని, ఆదివారాల్లోనూ బిల్లులు ప్రాసెస్ చేపట్టాలని నిర్ణయించింది.

ట్రెజరీ సర్వర్‌లో సమస్యలు
ap treasury

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బిల్లులకు సంబంధించిన ట్రెజరీ సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తాయి. అయితే సర్వర్ సమస్య ఉన్నప్పటికీ.. కొత్త జీతాలు చెల్లించేలా సర్కారు యత్నిస్తోంది. ఈ మేరకు ఉద్యోగుల జీతాల బిల్లుల ప్రాసెస్ చేపట్టింది. సర్వర్ సమస్యలతో ట్రెజరీకి చేరిన బిల్లుల ప్రాసెసింగ్ ఆలస్యం కానుంది. ఈ క్రమంలో శని, ఆదివారాల్లోనూ బిల్లులు ప్రాసెస్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈరోజు వరకు 4.50 లక్షల బిల్లులకుగానూ కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే ట్రెజరీలకు చేరాయి. ఇప్పటివరకూ 25 శాతం మంది ఉద్యోగుల జీతాల బిల్లులు ప్రాసెస్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసుశాఖతోపాటు కోర్టు ఉద్యోగుల బిల్లులే చేరుకున్నట్టు ట్రెజరీ విభాగం వెల్లడించింది.

డీడీవోలకు పాత జీతం చెల్లించాలని ఉద్యోగులు లేఖలు ఇచ్చారు. మరోవైపు ఉద్యోగులకు చెందిన బిల్లులు ప్రాసెస్‌ చేయాలని డీడీవోలపై కలెక్టర్లు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగుల ఖాతాల్లో కొత్త వేతనాలు పడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి : Support Rally for New Districts : కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ మహిళల ర్యాలీలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.