ETV Bharat / city

"రాష్ట్రంలో ఏరులైపారుతున్న.. మద్యం కల్తీ బ్రాండ్లు"

author img

By

Published : Jun 12, 2022, 6:18 PM IST

TDP LEADERS
నాణ్యమైన మద్యాన్ని నిషేధించారన్న తెదేపా నేతలు

GV ANJANEYULU: ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం అని రాష్ట్ర మహిళలకు వాగ్దానం చేసిన జగన్.. గద్దెనెక్కిన తర్వాత దానిని విస్మరించారని తెదేపా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో క్వార్టర్ మద్యం బాటిల్ రూ.5.20కి కొనుగోలు చేస్తే.. నేడు జగన్ రెడ్డి రూ.27కు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.

GV ANJANEYULU: మద్యం ఆదాయంపై 8 వేల కోట్ల రూపాయల పైనే అప్పు చేయడమంటే.. రాష్ట్రాన్ని అవమానించడమేనని తెదేపా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం అని రాష్ట్ర మహిళలకు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి.. గద్దెనెక్కిన తర్వాత దానిని విస్మరించారని ధ్వజమెత్తారు.

నాణ్యమైన మద్యాన్ని నిషేధించారన్న తెదేపా నేతలు

క్వార్టర్ మద్యం బాటిల్​ను తమ సర్కారు హయాంలో రూ 5.20కి కొనుగోలు చేస్తే.. నేడు జగన్ రెడ్డి రూ.27కు కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లిక్కర్ పరిశ్రమలన్నీ జగన్ రెడ్డి బంధువులవేనని ఆరోపించారు. ప్రభుత్వ మద్యం షాపులలో.. జగన్ మోహన్ రెడ్డి ప్రైవేటు మద్యం అమ్మకాలు చేస్తూ వేల కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నాయకులు నాటుసారా అమ్మకాలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని, కుటీర పరిశ్రమల ద్వారా నాటు సారా అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ప్రతి గ్రామంలోనూ 10 నుంచి 15 బెల్టుషాపులు కూడా ఉన్నాయని, మద్యం మత్తులో రాష్ట్రంలో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని, మహిళలపై అత్యాచారాలు హత్యలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల బలహీనతను అడ్డం పెట్టుకొని వైకాపా ప్రభుత్వం అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ పేదల రక్తం తాగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ మద్యం దుకాణాలలో ప్రైవేటు మద్యం విక్రయాలు, గ్రామాల్లో బెల్ట్ షాపులు, నాటు సారా తయారీ అమ్మకాలను నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. దీనిపై వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

గద్దె అనురాధ: దశలవారీగా మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్‌.. నాణ్యమైన మద్యాన్ని నిషేధించారని అనురాధ విమర్శించారు. దశలవారీగా కల్తీ సారా, కల్తీ బ్రాండ్లు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. నాణ్యత లేని మద్యం జనాలకు పోసి.. ఆరోగ్యాలు పాడుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.