ETV Bharat / city

ప్రభుత్వ లక్ష్యం అదే.. అందుకోసమే కొత్త మద్యం పాలసీ, బ్రాండ్లు: తెదేపా

author img

By

Published : Mar 24, 2022, 4:50 PM IST

సారా ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామనడం సిగ్గుచేటని ప్రభుత్వంపై తెదేపా ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మద్యంపై ఐదేళ్లలో పదివేల కోట్ల ఆదాయమే ముఖ్యమంత్రి లక్ష్యమని వారు ఆరోపించారు. అందుకోసమే కొత్తబ్రాండ్లు, కొత్త పాలసీ తెచ్చారని ధ్వజమెత్తారు.

అందుకోసమే కొత్త మద్యం పాలసీ, బ్రాండ్లు
అందుకోసమే కొత్త మద్యం పాలసీ, బ్రాండ్లు

అందుకోసమే కొత్త మద్యం పాలసీ, బ్రాండ్లు

మద్యంపై ఐదేళ్లలో పదివేల కోట్ల ఆదాయమే ముఖ్యమంత్రి లక్ష్యమని తెదేపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. అందుకోసమే కొత్తబ్రాండ్లు, కొత్త పాలసీ తెచ్చారని ధ్వజమెత్తారు. సభలో నిన్న ముఖ్యమంత్రి చెప్పిన ప్రతి మాటా అవాస్తవమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. డిస్టిలరీలను నడుపుతున్నది జగన్‌ బినామీలు కాదా ? అని ఆయన ప్రశ్నించారు. డిస్టిలరీలు చంద్రబాబు హయాంలోవి అంటున్న జగన్‌ ఎందుకు రద్దుచేయట్లేదని నిలదీశారు. తెలుగుజాతి ఉన్నంతవరకు చంద్రబాబు బ్రాండ్‌ ఉంటుందని.. చంద్రబాబు.. జగన్‌ మాదిరిగా ఛీప్‌ లిక్కర్‌ బ్రాండ్‌ కాదని అచ్చెన్నాయుడు అన్నారు.

సారా ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామనడం సిగ్గుచేటని.. తెలుగుదేశం సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపోయామన్న భావనలో.. రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పారు. వైకాపా ప్రభుత్వ పతనం ప్రారంభమైందని 2024లో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మద్యం మాఫియాకు సమాతరంగా బియ్యం మాఫియా కూడా తయారైందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు.

మద్యం, బియ్యం మాఫియాలో ముగ్గురు మంత్రులు.. 100 మంది వైకాపా ఎమ్మెల్యేలకు సంబంధం ఉందన్నారు. మద్యం ఆదాయం 5 శాతం రాష్ట్ర ఖజానాకు వెళ్తే.. 95 శాతం ఆదాయం సీఎం జగన్​కు వెళ్తోందని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. చంద్రబాబును అనుమతించిన డిస్టలరీలన్నింటినీ జగన్ మనుషులు.., సలహాదారులే లాక్కున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ ఆసుపత్రిలో చూసిన కల్తీ మద్యం బాధితులే కనిపిస్తున్నారని ఉండి ఎమ్మెల్యే రామరాజు అన్నారు. లిక్కర్ ఉత్పత్తి ధర కంటే..ఐదు రెట్లు ఎక్కువగా అమ్ముతున్నారన్నారు. రాష్ట్రంలో నాటుసారా బట్టీలు, బెల్టు షాపులు పెరిగిపోయాయని దుయ్యబట్టారు.

కల్తీసారా, జే బ్రాండ్ మద్యం కారణంగా 42 మంది చనిపోతే 10 నిమిషాలు చర్చించే సమయం కూడా సభకు లేదా అని తెదేపా ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నడూ లేనివిధంగా మండలిలోనూ సభ్యుల్ని సస్పెండ్ చేసే సంస్కృతి తీసుకొచ్చారని విమర్శించారు. సభలో లేని భాజపా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని కూడా సస్పెండ్ చేయడం విచిత్రంగా ఉందన్నారు.

మండలి ఛైర్మన్​ను సైతం జగన్ రెడ్డి ప్రభావితం చేశారన్నారు. సభలో తమ గొంతు నొక్కినా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాడతామని ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 140 కొత్త బ్రాండ్స్ తీసుకువచ్చారని నారా లోకేశ్ దుయ్యబట్టారు. మూడు రాజధానులు కావాలంటే రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంట్ సవరణ చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. పరిపాలన ఒకే చోట ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ కావాలనేది చంద్రబాబు నినాదంగా లోకేశ్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి : "నన్ను మందు తాగనివ్వరా..?" కత్తితో డాక్టర్ హల్​చల్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.