ETV Bharat / city

వివేకా హత్య కేసును కుమార్తె, అల్లుడిపై నెట్టడం దుర్మార్గం: బుద్ధా వెంకన్న

author img

By

Published : Mar 14, 2022, 7:23 AM IST

Buddha Venkanna on Viveka murder case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అసలు నిందితులను వదిలిపెట్టి వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డిపై నెట్టేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని.. తెదేపా నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్రపై సీబీఐ స్పష్టమైన ఆధారాలు చూపుతున్నా.. ముఖ్యమంత్రి నోరు విప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

tdp leader Buddha Venkanna fires on ysrcp on Viveka murder case
వివేకా హత్య కేసును కుమార్తె, అల్లుడిపై నెట్టడం దుర్మార్గం: బుద్ధా వెంకన్న

Buddha Venkanna on Viveka murder case: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్రపై సీబీఐ స్పష్టమైన ఆధారాలు చూపుతున్నా సీఎం జగన్‌ నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని.. మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. ఈ కేసులో అసలు నిందితులను వదిలిపెట్టి వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డిపై నెట్టేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని విమర్శించారు.

‘అవినాష్‌ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్​ చేయడం లేదో స్పష్టం చేయాల్సిన బాధ్యత అధినేతపై ఉంది. ఇలా మాట్లాడుతున్న మాపైనా అక్రమ కేసులు పెట్టడంతోపాటు దాడులకు దిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందుకు మేం సిద్ధమే’ -బుద్దా వెంకన్న, తెదేపా నేత

వివేకా కుమార్తె హైదరాబాద్‌లో ఉంటున్నందున.. ఆమెకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రక్షణ కల్పించాలని కోరారు.

‘సునీత వెనుక తెదేపా ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు. పులివెందుల నుంచి తెదేపా అభ్యర్థిగా ఆమె పోటీ చేయబోరని, తమ అభ్యర్థి బీటెక్‌ రవి అని చంద్రబాబు ప్రకటించాక కూడా ఈ ప్రచారమేంటి?’ -బుద్దా వెంకన్న, తెదేపా నేత

తన తండ్రిని చంపినవారిని శిక్షించాలని సోదరుడిని కోరినా.. ప్రయోజనం లేకపోవడంతో సునీత సీబీఐని ఆశ్రయించారని.. తెదేపా రాష్ట్ర కార్యదర్శి నాగుల్‌ మీరా వివరించారు.

ఇదీ చదవండి:

నాటుసారా మృతులపై మంత్రి ఆళ్ల నాని వ్యాఖ్యలు.. ఖండించిన కుటుంబసభ్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.