ETV Bharat / city

విజయవాడలో స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలు

author img

By

Published : Feb 17, 2021, 8:30 PM IST

విద్యార్థుల్లోని నైపుణ్యాలను ప్రదర్శించేందుకు చిత్రలేఖనం, మోడల్ మేకింగ్​లు ఉపకరిస్తాయని... విజయవాడ నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్​లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించారు.

swachh survekshan competitions in vijayawada
విజయవాడలో స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలు

స్వచ్ఛ సర్వేక్షన్​లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించారు. బుధవారం సీ.వీ.ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మోడల్, చిత్రలేఖనం పోటీలను నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయని.. కమిషనర్ పేర్కొన్నారు.

వాటర్ హార్వెస్టింగ్, స్వచ్ఛ విజయవాడ, గ్రీన్ విజయవాడ, ప్లాస్టిక్ ఫ్రీ విజయవాడ అనే టైటిల్​తో విద్యార్థులు ఏర్పాటు చేసిన మోడల్స్ ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో వ్యాసరచన, చిత్రలేఖనం మోడల్ మేకింగ్​లో విజయం సాధించిన విద్యార్థులకు స్వచ్ఛ సర్వేక్షన్ ప్రత్యేక కార్యక్రమం పేరున బహుమతులు అందజేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

ఎన్నికల ముందు సరే.. తర్వాత వాడేసిన బ్యాలెట్ పత్రాలు ఏం చేస్తారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.