ETV Bharat / city

ఉద్యోగం ఆశ చూపి అత్యాచారం.. పోలీసులకు ఫిర్యాదు

author img

By

Published : Feb 21, 2021, 5:10 PM IST

ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపి... తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది.

rape
rape

తనకు ఉద్యోగం ఆశ చూపించి.. అత్యాచారం చేశాడంటూ ఓ యువతి హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. రహమత్ నగర్ పరిధిలోని కార్మికనగర్​లో.. బీకాం పూర్తి చేసిన ఆ యువతి.. అమెజాన్​లో ఓ ఉద్యోగం నిమిత్తం ముఖాముఖికి వెళ్లింది.

అక్కడ సంస్థ మేనేజర్​గా రాజు అనే వ్యక్తి పరిచయమయ్యాడని ఆ యువతి తెలిపింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి తన గదికి పిలిపించుకున్నాడని.. అక్కడే అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రిమ్స్ ఆసుపత్రి మూడో అంతస్తు నుంచి దూకిన రోగి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.