ETV Bharat / city

SEC: ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారానికి 'కాల్ సెంటర్' ఏర్పాటు

author img

By

Published : Nov 3, 2021, 9:19 PM IST

స్థానిక సంస్ధల ఎన్నికలపై ఫిర్యాదుల నేపథ్యంలో విజయవాడలోని ఎస్​ఈసీ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు(call center for local body elections) చేశారు. దీని ద్వారా ఎన్నికలకు సంబంధించి అవకతవకలు, అక్రమాలపై ఫిర్యాదు చేయడం సహా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని ఎస్​ఈసీ స్పష్టం చేసింది.

sec call center at vijayawada
ఎస్​ఈసీ కార్యాలయంలో కాల్ సెంటర్

స్థానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ప్రజలు, అభ్యర్థులు.. ఫిర్యాదులు చేసేందుకు వీలుగా విజయవాడలోని ఎస్​ఈసీ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు(sec call center) చేసింది. ఎన్నికలకు సంబంధించి అవకతవకలు, అక్రమాలపై ఫిర్యాదు చేయడం సహా సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం ఈ సేవలను వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

ఫిర్యాదు చేయాల్సిన...

  • కాల్ సెంటర్ నెంబర్‌ 0866 2466877
  • ఈ-మెయిల్ ఐడీ apsec.callcenter@gmail.com

ఖచ్చితమైన, తగిన ఆధారాలతో ఫిర్యాదులు చేయవచ్చని.. నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని ఎస్​ఈసీ(sec on call center) స్పష్టం చేసింది.

ఇదీ చదవండి..: Farmers Protest: తమపై దాడికి వచ్చిన పోలీసులను తరిమికొట్టిన.. అన్నదాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.