ETV Bharat / city

ప్రయాణికులపై ఆర్టీసీ బాదుడు..‘మూడేళ్లలో’ మూడోసారి

author img

By

Published : Jul 2, 2022, 4:11 AM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ ఛార్జీల పెంపు అడ్డూ అదుపూ లేకుండా సాగిస్తూ ప్రయాణికుల నడ్డివిరుస్తోంది. జగన్‌ సర్కారు అధికారం చేపట్టిన 5 నెలలకే ఛార్జీల మోత మోగించగా.. మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్‌ 14న డీజిల్‌ సెస్‌ పేరిట ఓసారి పెంచింది. తాజాగా మరోసారి డీజిల్‌ సెస్‌ పేరిట బాదేసింది. మొత్తంగా మూడు దఫాలుగా ఛార్జీల పెంపుతో ప్రయాణికులపై ఏటా దాదాపు 2 వేల కోట్ల రూపాయల మేర భారం పడుతోంది. ఛార్జీలు తక్కువే పెంచుతున్నామని బయట చెబుతూ లోపల మాత్రం ఎక్కువ లాగేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఎడా పెడా బాదేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

ఆర్టీసీ బాదుడు
ఆర్టీసీ బాదుడు

మూడేళ్లు తిరక్కుండానే వైకాపా ప్రభుత్వం మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక 2019 డిసెంబరులో మొదటిసారి ఛార్జీలు పెంచారు. డీజిల్, విడిభాగాలు, టైర్ల ధరల పెరుగుదల, ఉద్యోగుల జీతాల భారంతో ఛార్జీలు పెంచుతున్నామంటూ ఏటా ప్రయాణికులపై ఏటా 700 కోట్ల రూపాయలకు పైగా భారం వేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 14 నుంచి డీజిల్‌ సెస్‌ పేరిట ఛార్జీలు పెంచి ఏటా మరో 720 కోట్ల రూపాయల మేర ప్రయాణికులపై వడ్డించారు. తాజాగా జులై 1 నుంచి పెరిగిన టికెట్‌ ఛార్జీలతో ప్రయాణికులపై ఏటా 500 కోట్లకు పైగా భారం పడుతోంది. 3 దఫాలుగా పెంచిన ఛార్జీలతో ప్రయాణికులపై ఏటా దాదాపు 2 వేల కోట్ల వరకు భారం పడినట్లయింది. గతంలో ఆర్టీసీ ఛార్జీలు ఒకసారి పెంచాక కొన్నేళ్లపాటు అవే కొనసాగేవి. ఇప్పుడు ఏప్రిల్‌లో ఛార్జీలు పెంచి 3 నెలలు తిరక్కుండానే మళ్లీ పెంచేయడంపై ఆర్టీసీ వర్గాలూ విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా నెలల వ్యవధిలో పెంచడం సంస్థ చరిత్రలోనే తొలిసారి అని చెబుతున్నారు.

ఆర్టీసీ నడిపే బస్సుల్లో 49 శాతం పల్లెవెలుగు సర్వీసులే. ఇందులో అత్యధిక మంది ప్రయాణికులు రూపాయి రూపాయి లెక్క చూసుకునే పేదలే. 3సార్లు ఛార్జీల పెంపుతో వీరిపైనే అత్యధికంగా భారం వేశారు. పల్లెవెలుగుల్లో 2019 నవంబరులో కిలోమీటర్‌కు 63 పైసల చొప్పున ఉన్న ఛార్జి ఇప్పుడు రూపాయి 2పైసలకి చేరింది. పల్లెవెలుగు సర్వీసుల్లో అత్యధికంగా 61.90 శాతం మేర ఛార్జీలు పెంచి, గ్రామీణ ప్రజలపై పెనుభారం వేశారు. పల్లెవెలుగు తర్వాత రాష్ట్రంలో ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు 16.39 శాతం ఉన్నాయి. వీటిలోనూ మూడేళ్లలో పెంపు 43.67 శాతానికి చేరింది. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే సూపర్‌ లగ్జరీ సర్వీసులు 12 శాతం ఉంటే.. ఇందులో 39.65 శాతం ఛార్జీలు పెరిగాయి. ఇంద్ర ఏసీ బస్సుల్లో 34.24 శాతం పెరిగాయి. ఇలా ఏ సర్వీసునూ వదలకుండా అందరినీ బాదేశారు. ప్రజలకు రవాణా సదుపాయం కల్పించాల్సిన ప్రభుత్వ రంగ సంస్థ.. ఇలా పదేపదే ఛార్జీలు పెంచి, ప్రైవేటు సంస్థలా వ్యవహరించడమేంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలం చెల్లిన డొక్కు బస్సులను నడుపుతూ, వాటిలోనూ ఛార్జీలు పదే పదే పెంచడమేంటని నిలదీస్తున్నారు.

ఏప్రిల్‌ 14న పెంచిన ఛార్జీల్లో పల్లెవెలుగు ప్రయాణికులపై ఎక్కువ భారం పడింది. వీటిలో స్టేజి స్టేజికీ ఛార్జీలు పెంచారు. తక్కువ దూరాలకు సైతం 15 నుంచి 20 రూపాయల వరకు ఛార్జీలు పెరిగాయి. అప్పట్లో సూపర్‌ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ఎంత దూరం వెళ్లినా సగటున 10 నుంచి 20 రూపాయల చొప్పున మాత్రమే అదనంగా వసూలు చేశారు. తాజా పెంపులో దూర ప్రాంత ప్రయాణికులనూ వదల్లేదు. దూరం పెరుగుతున్నకొద్దీ ఛార్జీ పెరుగుతూ పోయింది. గరిష్ఠంగా 120 నుంచి 140 రూపాయల వరకు బాదేశారు.

...

తిరుపతి తిరుమల ఘాట్‌లో తిరిగే ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో 2019 నవంబరుతో పోలిస్తే.. ఇప్పుడు ఒక్కో టికెట్‌పై 35 రూపాయల చొప్పున పెరిగిపోయింది. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో వెళ్లే ప్రయాణికులకు ఇది అదనపు భారమే. తిరుమల శ్రీవారితో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలను దర్శించుకొనేందుకు వచ్చే భక్తులపై అధిక భారం పడుతోంది. పెరిగిన బస్సు ఛార్జీలు తిరుమలకు రావడానికి ముందే....తమకు గుండు గీసేలా తయారయ్యాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

...

ఎపీఎస్ ఆర్టీసీ సంస్థలో ఎన్నో ఏళ్లుగా ప్రజలకు ఏది చెబుతారో అదే అమలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆ విధానాన్ని పక్కన పెట్టారు. అధికారులు మీడియాకు విడుదలచేసే ప్రకటనలకు , సంస్థలో సిబ్బందికి ఇచ్చే ఆదేశాల్లో తేడాలుంటున్నాయి. కొన్నికీలక విషయాలను దాస్తుండటం విస్మయానికి గురి చేస్తుంది. ఛార్జీలు తక్కువే పెంచుతున్నామని పైకి చెబుతూ సర్క్యులర్ల లో మాత్రం అదనంగా బాదేస్తున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలే దీనికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.

ప్రకటన అనంతరం అదే రోజు రాత్రికి రాష్ట్ర వ్యాప్తంగా డిపో అధికారులకు పంపిన ఆదేశాలు మాత్రం మరోలా ఇచ్చారు. డీజిల్ సెస్ విధింపుతో పాటు టికెట్ ఛార్జీనీ పెంచేశారు. పల్లెవెలుగుబస్సుల్లో సెస్ 5 రూపాయలతో పాటు కిలోమీటర్ల ప్రకారం మూడింతలు ఛార్జీలు పెంచారు. పల్లె వెలుగుబస్సుల్లో దూరాన్ని బట్టి ఏకంగా 15 నుంచి 20 రూపాయలు ఛార్జీ ని పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు . మళ్లీ మూడు నెలలు గడవక ముందే జూన్ 30న మరో సారి ఆర్టీసీ డీజిల్ సెస్ ను పెంచింది. కనీసం మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయకుండా నామ మాత్రంగా పత్రికా ప్రకటన ఇచ్చి చేతులు దులిపేసుకుంది. దానిలో ఎక్కడా సమగ్ర వివరాలు ఇవ్వలేదు. డీజిల్ రేట్లు పెరగడం వల్ల స్వల్పంగా మాత్రమే డీజిల్ సెస్ పెంచామని పత్రికా ప్రకటనలో తెలిపింది. రాత్రికి డిపోలకు అంతర్గతంగా పంపిన సర్క్యులర్ల లో దిమ్మదిరిగే విషయాలు ప్రస్తావించింది. గతంలో టికెట్ పై 5 నుంచి 10 రూపాయలు మాత్రమే సెస్ ఉండగా.. దీన్ని దూరాన్ని బట్టి 10 నుంచి 140 రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపింది. బస్సుల్లో కనీస చార్జీలు పెంచుతున్నట్లు పత్రికా ప్రకటనలో ఎక్కడా చెప్పని ఆర్టీసీ.. డిపోలకు అంతర్గతంగా పంపిన ఉత్తర్వుల్లో పల్లెవెలుగు మినహా అన్ని బస్సుల్లో కనీస ఛార్జీలను పెంచుతున్నట్లు తెలిపింది.

* సర్వీసులో గుడివాడ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుడు 2019 నవంబరు వరకు టికెట్‌ ఛార్జీగా రూ.30 చెల్లించేవాడు. ఇప్పుడది ఏకంగా రూ.55కి చేరింది.

* విజయవాడలో ఉద్యోగం చేస్తూ, వారాంతంలో విశాఖకు వెళ్లి వచ్చే ఓ ఉద్యోగికి సూపర్‌ లగ్జరీ బస్సులో 2019 నవంబరులో టికెట్‌ ధర రూ.475. ఇప్పుడది రూ.670కి పెరిగింది.

* ఓ జంట, తమ ఇద్దరు పిల్లలతో 2019లో తిరుపతి నుంచి తిరుమల వెళ్లేందుకు ఘాట్‌ సర్వీసులో ఛార్జీల కింద రూ.180 (పెద్దలు ఇద్దరికి రూ.110, పిల్లలకు రూ.70) ఖర్చు చేశారు. ఇప్పడు వారు రూ.280 (పెద్దలు ఇద్దరికి రూ.180, పిల్లలకు రూ.100) వెచ్చించాల్సి వచ్చింది.

పల్లెవాసిపై పిడుగు
ఆర్టీసీ నడిపే బస్సుల్లో 49 శాతం పల్లెవెలుగు సర్వీసులే. ఇందులో ఎక్కువ మంది ప్రయాణికులు రూపాయి రూపాయి లెక్క చూసుకునే పేదలే.

మూడుసార్లు ఛార్జీల పెంపుతో వీరిపైనే అత్యధికంగా భారం వేశారు. పల్లెవెలుగుల్లో 2019 నవంబరులో కి.మీ.కు 63 పైసల చొప్పున ఉన్న ఛార్జి ఇప్పుడు రూ.1.02కి చేరింది. అంటే 61.90% పెరిగింది.

* పల్లెవెలుగు తర్వాత రాష్ట్రంలో ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు 16.39 శాతం ఉన్నాయి. వీటిలోనూ మూడేళ్లలో పెంపు 43.67 శాతానికి చేరింది.

* దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే సూపర్‌ లగ్జరీ సర్వీసులు 12 శాతం ఉంటే.. ఇందులో 39.65 శాతం ఛార్జీలు పెరిగాయి.

వేంకన్న భక్తులపైనా భారం

తిరుపతి తిరుమల ఘాట్‌లో తిరిగే ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో 2019 నవంబరుతో పోలిస్తే.. ఇప్పుడు ఒక్కో టికెట్‌పై రూ.35 చొప్పున పెరిగిపోయింది. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో వెళ్లే ప్రయాణికులకు ఇది అదనపు భారమే.

నిత్యవసరాల మాదిరిగా పెంచేస్తున్నారు

ఎక్కువ మంది పేద, మధ్యతరగతి వాళ్లు తిరిగే పల్లె వెలుగు సర్వీసులను కూడా వదల్లేదు. ఇప్పటికే నిత్యావసరాలు సహా అన్నింటి ధరలూ పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నాం. దీనికి ఆర్టీసీ ఛార్జీలు కూడా తోడయ్యాయి. - బాబాజీ, అమలాపురం

ఇక ప్రైవేటుకు, ఆర్టీసీకి తేడా ఏంటి?

పనిమీద హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి వచ్చాను. ముందు రోజు సూపర్‌లగ్జరీలో ఛార్జీ రూ.670 ఉంది. ఇప్పుడు తిరుగు ప్రయాణంలో టికెట్‌ ధర రూ.820 చెప్పారు. ఇంత భారం మోపడం సరికాదు. ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వ రంగ సంస్థ లాభనష్టాలు చూసుకోకూడదు. ఇలా అయితే ప్రైవేటు ట్రావెల్స్‌కు, ఆర్టీసీకి తేడా ఏంటి? - జిలానీ, ప్రయాణికుడు

...
....

ఇదీ చదవండి: CBN: సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి: చంద్రబాబు

నాకు, నరేశ్​కు మీ సపోర్ట్​ కావాలి: పవిత్రా లోకేశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.