ETV Bharat / city

Flights: గన్నవరం విమానాశ్రయానికి విదేశీ సర్వీసులు పునఃప్రారంభం

author img

By

Published : Jun 2, 2021, 6:38 PM IST

Updated : Jun 2, 2021, 8:43 PM IST

flights
గన్నవరం విమానాశ్రయానికి విదేశీ సర్వీసులు పునఃప్రారంభం

18:32 June 02

దుబాయ్ నుంచి గన్నవరం చేరుకున్న విమానం

గన్నవరం విమానాశ్రయానికి విదేశీ సర్వీసులు పునఃప్రారంభం

విజయవాడ (Vijayawada Airport) అంతర్జాతీయ విమానాశ్రయానికి.. విదేశీ సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి 65 మంది ప్రవాసాంధ్రులతో ప్రత్యేక విమానం రాష్ట్రానికి చేరుకుంది. కరోనా కారణంగా ఏప్రిల్ 3 నుంచి తాత్కాలికంగా నిలిచిన విదేశీ సర్వీసులను.. వందేభారత్ మిషన్‌లో భాగంగా పునఃప్రారంభించారు. ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ప్రవాసాంధ్రులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 


ఇదీ చదవండి:

 jagananna house: వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి రేపు శ్రీకారం

Last Updated :Jun 2, 2021, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.