ETV Bharat / city

NITI Aayog Vice Chairman meets CM Jagan: ఏపీ సమగ్రాభివృద్ధికి కేంద్ర సహకారం అందేలా చూస్తాం: నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్

author img

By

Published : Dec 1, 2021, 5:12 PM IST

Updated : Dec 1, 2021, 8:39 PM IST

NITI Aayog Vice Chairman meets CM Jagan: ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్‌ జగన్‌ను.. నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సహా.. రాష్ట్ర ఉన్నతాధికారులతో నీతి ఆయోగ్ బృందం సమావేశమయ్యారు.

NITI Aayog Vice Chairman Rajiv kumar meets CM Jagan
సీఎం జగన్​తో నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ సమావేశం

NITI Aayog Vice Chairman meets CM Jagan: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్​తో నీతిఆయోగ్ బృందం భేటీ అయింది. రాష్ట్ర విభజన వల్ల ఎదురైన ఇబ్బందులను, రాష్ట్రంలో అమలవుతున్న నవరత్నాలపై నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్​కుమార్ బృందానికి అధికారులు వివరించారు. పారిశ్రామిక రాయితీ, పన్ను మినహాయింపు ఇవ్వాలని, కోరాపుట్, బాలంగీర్, బుందేల్ ఖండ్ తరహాలో అదుకోవాలని అధికారులు కోరారు. విభజన చట్టం హామీలన్నీ నెరవేర్చాలని విన్నవించారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగ సమస్యను అధికారులు నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్రానికి కేంద్రం, నీతిఆయోగ్‌ అండగా నిలవాలి: సీఎం జగన్‌

రాష్ట్రానికి కేంద్రం, నీతిఆయోగ్ అండగా నిలవాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలన్న ఆయన...రుణ భారంతో ఉన్న విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సంస్థలను గాడిలో పెట్టేందుకు తగిన సాయం చేయాలని కోరారు.

ఏపీ సమగ్రాభివృద్ధికి కేంద్ర సహకారం అందేలా చూస్తాం: రాజీవ్‌కుమార్‌

ఏపీ సమగ్రాభివృద్ధకి కేంద్ర సహకారం అందేలా చూస్తామని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకారం అందిస్తామన్నారు. ఏపీ తీర ప్రాంత ఆర్థిక మండళ్లు, ఎగుమతుల వృద్ధికి సాయం చేస్తామన్న రాజీవ్ కుమార్...మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రానికి చేయూతను అందిస్తామన్నారు. హైదరాబాద్ కోల్పోవడంతో ఆదాయం తగ్గిందన్న విషయం తెలుసన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ కోరినట్లు వెల్లడించిన ఆయన... రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: NITI AAYOG: వీరపనేనిగూడెంలో నీతి ఆయోగ్ బృందం పర్యటన

Last Updated :Dec 1, 2021, 8:39 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.