ETV Bharat / city

విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే.. లాఠీఛార్జ్ చేస్తారా? : లోకేశ్‌

author img

By

Published : Nov 8, 2021, 1:40 PM IST

Updated : Nov 8, 2021, 7:17 PM IST

అనంతపురంలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (nara lokesh fire on police lathicharge at anantapur) తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను అణచివేయాలని చూస్తే.. గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

nara lokesh fire on police lathicharge
శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే లాఠీఛార్ చేస్తారా


"ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రైవేటీకరణ ఆపాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసన.. రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమా?" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల వద్ద.. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్​(nara lokesh fire on police lathicharge at anantapur) చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దమనకాండ సాగించడం.. జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించడంతోపాటు, లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఉద్యమాలు అణచివేయాలని చూస్తే.. గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన లోకేశ్(lokesh on aided schools)... ఎస్​ఎస్​బీఎన్​ కళాశాల వద్ద దాడి ఘటన(police lathicharge on students at anantapur)కు సంబంధించిన దృశ్యాలను తన ట్విట్టర్​ ఖాతాలో పోస్టు చేశారు.

లోకేశ్ పరామర్శ...

విద్యార్థులపై లాఠీఛార్జ్‌ను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఖండించారు. ఇది జగన్‌ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడిన విద్యార్థినిని లోకేశ్‌ ఫోన్‌లో పరామర్శించారు. విద్యార్థులకు అండగా ఉంటామని ఆందోళన చెందవద్దని సూచించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులను ఆదేశించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

  • శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం @ysjagan అహంకార ధోరణికి నిదర్శనం. అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/3) pic.twitter.com/14TKhQIGyt

    — Lokesh Nara (@naralokesh) November 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చంద్రబాబు ఆగ్రహం...

అనంతపురంలో విద్యార్థులపై పోలీసుల వైఖరిని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. వైకాపా రౌడీల్లా వ్యవహరించారని విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఉగ్రవాదుల కన్నా దారుణంగా హింసించడం అన్యాయమని ఆక్షేపించారు. విద్యార్థుల‌కి మేన‌మామ‌ని అంటూ ప్రకటించుకుని వారినే అత్యంత దారుణంగా హింసిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘవిద్రోహ శక్తులు, డ్రగ్ మాఫియాలకు రక్షణగా నిలిచేందుకేనా రాష్ట్రంలో పోలీసులున్నదని దుయ్యబట్టారు. ప్రశ్నించే ప్రజలైనా, ప్రతిపక్షమైనా దాడులే సమాధానమా అని ప్రశ్నించిన చంద్రబాబు... నిలదీసే విద్యార్థులకు లాఠీదెబ్బలే జవాబుగా చెప్పటం ప్రజాస్వామ్యమా లేక రాక్షస‌రాజ్యమా అని నిలదీశారు.

ఇదీ చదవండి..

అనంతపురంలో ఎస్‌ఎస్‌బీఎన్‌ ఎయిడెడ్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత .. పోలీసుల లాఠీచార్జీ

Last Updated : Nov 8, 2021, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.