ETV Bharat / city

Municipal Workers Protest: పారిశుద్ద్య కార్మికుల 'చలో విజయవాడ'.. అడ్డుకున్న పోలీసులు

author img

By

Published : Mar 11, 2022, 10:07 AM IST

Updated : Mar 11, 2022, 10:37 AM IST

Municipal workers Protest: సమస్యల పరిష్కారం కోసం.. పారిశుద్ధ్య కార్మికులు తలపెట్టిన 'చలో విజయవాడ' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి తరలివస్తున్న కార్మికులను అడ్డుకుని.. అరెస్టులు చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడ వెళ్తున్న తమను అరెస్ట్‌ చేయటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

municipal workers called up for chalo vijayawada and police arrests them
రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ద్య కార్మికుల చలో విజయవాడ.. అడ్డుకున్న పోలీసులు

రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ద్య కార్మికుల చలో విజయవాడ.. అడ్డుకున్న పోలీసులు

Municipal workers Protest: సమస్యల పరిష్కారం కోసం పారిశుద్ధ్య కార్మికులు 'చలో విజయవాడ' చేపట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి విజయవాడకు తరలివస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ కార్మికులు, సీఐటీయూ నాయకులను పోలీసులు అడ్డుకుని.. అరెస్ట్ చేశారు. అరెస్ట్‌ను నిరసిస్తూ.. పోలీస్ స్టేషన్ ముందు మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడ వెళ్తున్న తమను అరెస్ట్‌ చేయటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి.. సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

విధులు నిర్వహించుకుని వస్తుండగా అరెస్ట్​

ప్రకాశం జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల నుంచి కార్మికులు విజయవాడ వెళ్లకుండా ఎక్కడికక్కడే నియంత్రించారు. ఒంగోలు కార్పొరేషన్​లో పని చేస్తున్న కార్మికులను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. రాత్రి విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్లే సమయంలో.. పోలీసులు అరెస్ట్ చేయడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. ఉదయం స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడానికి నిరసన తెలిపే హక్కునూ ప్రభుత్వం ఇవ్వకపోవడం శోచనీయమని, పోలీసుల తీరు అన్యాయమని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి:

Last Updated :Mar 11, 2022, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.