ETV Bharat / city

గవర్నర్ బిశ్వ భూషణ్​ను కలిసిన.. మిజోరాం గవర్నర్ హరిబాబు

author img

By

Published : Oct 30, 2021, 5:23 PM IST

మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వివిధ పరిపాలనా సంబంధమైన అంశాలపై వారు చర్చించారు.

mizoram governer kambampati haribabu met ap governer bishwabushan harichandan
గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను కలిసిన మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు

రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్(ap governer bishwabushan harichandan)​ను.. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు(mizoram governer kambampati haribabu) మర్యాద పూర్వకంగా కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్​(raj bhavan)కు చేరుకున్న హరిబాబుకు.. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా స్వాగతం పలికారు.

తొలుత హరిబాబు రాష్ట్ర గవర్నర్​ను మిజోరాం సంప్రదాయాలతో ఘనంగా సత్కరించారు. బిశ్వ భూషణ్ హరిచందన్ రాష్ట్ర సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా శ్రీవేంకటేశ్వరస్వామివారి ప్రతిమను బహూకరించారు. ఇద్దరు గవర్నర్లు సుమారు అరగంటకు పైగా భేటి కాగా, సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. దేశంలో కరోనా పరిస్థితులు చక్కబడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మిజోరాంలో పర్యటించాలని హరిబాబు.. రాష్ట్ర గవర్నర్ హరిచందన్​ను ఆహ్వానించారు.

ఇదీ చదవండి:

Vice President: గన్నవరం చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.