ETV Bharat / city

MINISTERS FIRE ON CHANDRABABU: 'చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారింది'

author img

By

Published : Oct 21, 2021, 7:51 PM IST

తెదేపా నేతల తీరుపై(TDP leaders) మంత్రులు పేర్ని నాని, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తానేటి వనిత, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాం(chandrababu rulling)లోనే రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారిందని ఆరోపించారు. గంజాయి సాగుపై అసత్య ప్రచారాలు చేస్తున్న తెదేపా నేత అయ్యన్నపాత్రుడిని ముందు అరెస్ట్ చేసి, పట్టాభిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

తెదేపా నేతల తీరుపై మంత్రుల ఆగ్రహం
తెదేపా నేతల తీరుపై మంత్రుల ఆగ్రహం

తెదేపా నేతల తీరుపై మంత్రుల ఆగ్రహం

తెదేపా కేంద్ర కార్యాలయం(tdp central office)పై జరిగిన దాడిని నిరసిస్తూ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు(chandrababunaidu) చేపట్టిన దీక్షపై మంత్రి పేర్ని నాని స్పందించారు. చంద్రబాబు దొంగ దీక్ష చేపట్టారని ఎద్దేవా చేశారు. స్క్రిప్టు రాయించి పట్టాభితో తిట్టించారన్న మంత్రి.. దీక్షకు కారణమేంటో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో అమిత్ షా(amith sha)పై గతంలో తెదేపా నేతలు దాడి చేశారని మంత్రి పేర్ని నాని(minister perni nani) అన్నారు. ఆ సమయంలో పోలీసులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారిందన్నారు. గంజాయి నివారించడానికి ప్రభుత్వానికి తలప్రాణం తోకకొస్తోందని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు దొంగ దీక్ష మొదలుపెట్టారు. స్క్రిప్టు రాయించి పట్టాభితో తిట్టించారు. దీక్షకు కారణమేంటో చంద్రబాబు చెప్పాలి. తిరుపతిలో అమిత్ షాపై గతంలో తెదేపా గూండాలు దాడిచేశారు. బంద్‌తో ఆర్థికంగా నష్టమని గతంలో చంద్రబాబు అన్నారు. చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారింది. - పేర్ని నాని, మంత్రి

పరివర్తన కోసం చర్యలు...

గంజాయి సాగును ఉక్కుపాదంతో అణిచివేయాలని సీఎం జగన్‌(CM jagan) ఆదేశాలిచ్చారని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(minister muthamshetty srinivas) తెలిపారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా తాడేపల్లికి సంబంధాలున్నాయని తెలుగుదేశం ఆరోపించటాన్ని మంత్రి తప్పు పట్టారు. బయట రాష్ట్రాల నుంచి వలస వచ్చిన అమాయక గిరిజనులు ఉపాధి లేక ఈ గంజాయి సాగులో ఉంటున్నారన్న మంత్రి వారిలో పరివర్తన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గంజాయి సాగుపై అసత్య ప్రచారాలు చేస్తున్న తెదేపా నేత అయ్యన్న పాత్రుడి(ayyanna pathrudu)ని ముందు అరెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు.

గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపాలని జగన్‌ ఆదేశాలిచ్చారు. ఎక్కడ ఏం జరిగినా..తాడేపల్లికి సంబంధాలున్నాయని తెదేపా నేతలు ఆరోపణలు చేయడం సరికాదు. - ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంత్రి

పార్టీ నుంచి బహిష్కరించాలి...

పులి పంజా విసిరితే ఏమవుతుందో తెలుగుదేశం నాయకులు గ్రహించాలని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్(dharmana krishna das) అన్నారు. పట్టాభి లాంటి వ్యక్తులను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. చిన్నారుల పౌష్టికాహారం కోసం గత ప్రభుత్వం... ఏడాదికి రూ.500 కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం రూ.1200 కోట్లు కేటాయించిందని మంత్రి తానేటి వనిత అన్నారు. ప్రతిపక్షం దుర్భాషలాడటం మానుకోవాలని హితవు పలికారు.

అనుబంధ కథనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.