ETV Bharat / city

విద్యాసంస్థలు తెరిచాం.. విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదు: సురేశ్‌

author img

By

Published : Jan 17, 2022, 3:20 PM IST

Updated : Jan 17, 2022, 7:11 PM IST

విద్యాసంస్థలు తెరిచాం
విద్యాసంస్థలు తెరిచాం

15:16 January 17

సంక్రాంతి సెలవుల తర్వాత విద్యాసంస్థలు మొదలయ్యాయి

Minister Suresh On Schools open: సంక్రాంతి సెలవుల తర్వాత విద్యాసంస్థలు మొదలయ్యాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. విద్యార్థుల రోజువారీ హాజరు తీసుకుంటున్నామని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదని.., పరీక్షలు నిర్వహించేలా పాఠశాలల్లో బోధన జరుగుతోందన్నారు. కొవిడ్ వల్ల గత రెండేళ్లుగా ఆల్ పాస్ విధానం అనుసరించామని.. భవిష్యత్తులో విద్యార్థులకు ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదన్నారు.

26 లక్షల మంది విద్యార్థుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్ పూర్తిచేసినట్లు మంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయులకు కూడా కొవిడ్ వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామన్నారు. కొవిడ్ దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూనే బోధన జరుగుతుందన్నారు. గత 150 రోజులుగా నిరంతరాయంగా పాఠశాలలు నడిచాయని.., విద్యా సంవత్సరం నష్టపోవద్దనే పాఠశాలల నిర్వహిస్తున్నామని తెలిపారు. కొవిడ్ వ్యాప్తికి పాఠశాలల నిర్వహణకు సంబంధం లేదన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

"విద్యార్థుల రోజువారీ హాజరు తీసుకుంటున్నాం. విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదు. పరీక్షలు నిర్వహించేలా పాఠశాలల్లో బోధన జరుగుతోంది. 26 లక్షల మంది విద్యార్థుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్ పూర్తి చేశాం. ఉపాధ్యాయులకు కూడా కొవిడ్ వ్యాక్సినేషన్‌ పూర్తి చేశాం. కొవిడ్ దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూనే బోధన. 150 రోజులు నిరంతరాయంగా పాఠశాలలు నడిచాయి. కొవిడ్ వ్యాప్తికి పాఠశాలల నిర్వహణకు సంబంధం లేదు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే తగిన నిర్ణయం తీసుకుంటాం." -ఆదిమూలపు సురేశ్‌, విద్యాశాఖ మంత్రి

పొరుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు రద్దుచేస్తే.. జాగ్రత్తలతో ఏపీలో నిర్వహించామని గుర్తు చేశారు. ఆన్‌లైన్ విద్యా బోధనకు పరిమితి ఉందని.., ప్రాథమిక, మాధ్యమిక విద్యకు ఆన్‌లైన్‌ ప్రత్యామ్నాయం కాదన్నారు. విద్యార్థులు క్యారియర్లు అయినా.. వారికి వ్యాక్సిన్ వేస్తున్నామని చెప్పారు. అత్యవసర స్థితుల్లో నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే 30 శాతం సిలబస్ పూర్తి చేసినట్లు మంత్రి సురేశ్‌ వెల్లడించారు.

"సంక్రాంతి తర్వాత విద్యాసంస్థల్లో 61 శాతం హాజరు నమోదు. అధికంగా అనంతపురం జిల్లాలో 70 శాతం హాజరు నమోదు. కడప, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 67 శాతం హాజరు నమోదు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలల నిర్వహణ. కొవిడ్ వివరాలు తెలుసుకునేందుకు కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశాం. పాఠశాల, ఇంటర్‌ విద్యాశాఖ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశాం. పాఠశాల విద్యాశాఖ కంట్రోల్ రూమ్ నెం.78338 88555, ఇంటర్‌ విద్యాశాఖ కంట్రోల్ రూమ్ నెం.94408 16025." - సురేశ్, విద్యాశాఖ మంత్రి

ఇదీ చదవండి :

CM Jagan Review: కొవిడ్, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష

Last Updated : Jan 17, 2022, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.