ETV Bharat / city

బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం

author img

By

Published : Mar 2, 2022, 6:06 PM IST

Low Pressure Area Over Bay of Bengal: దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 48 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఫలితంగా ఈనెల 4 నుంచి రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

low-pressure area over Bay of Bengal
low-pressure area over Bay of Bengal

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ.. శ్రీలంక వైపు నుంచి తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో ఈ నెల 4వ తేదీ నుంచి రాయలసీమ, కోస్తాంధ్ర తీరాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది.

ఈ నెల 4 నుంచి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో చాలా చోట్ల వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి 45-55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా ఆంధ్ర, తమిళనాడు కోస్తా ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

ఇదీ చదవండి:

ఏపీ రాజధాని అమరావతేనన్న కేంద్రం.. బడ్జెట్‌లో కేటాయింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.