Letter: 'పోలవరం పరిహారం పక్కదారి'..కేంద్ర విజిలెన్స్ కమిషనర్​కు లోకేశ్ ఫిర్యాదు

author img

By

Published : Sep 24, 2021, 8:11 PM IST

కేంద్ర విజిలెన్స్ కమిషనర్​కు లోకేశ్ ఫిర్యాదు

పోలవరం (Polavaram) నిర్వాసితులుగా ఉన్న ఆదీవాసీలకు దక్కాల్సిన పరిహారాన్ని వైకాపా నేతలు స్థానిక అధికారులతో కుమ్మక్కై కాజేస్తున్నారని తెదేపా నేత నారా లోకేశ్ (Lokesh) ఆరోపించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర విజిలెన్స్ కమిషనర్​ (Central Vigilance Commissioner)కు లేఖ (Letter) ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ మెుత్తం అవినీతి విలువ రూ.3 కోట్ల వరకూ ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేంద్ర విజిలెన్స్ కమిషనర్​కు లోకేశ్ ఫిర్యాదు
కేంద్ర విజిలెన్స్ కమిషనర్​కు లోకేశ్ ఫిర్యాదు

పోలవరం (Polavarm) నిర్వాసితులుగా ఉన్న ఆదివాసీలకు దక్కాల్సిన పరిహారాన్ని వైకాపా నేతలు స్థానిక అధికారులతో కుమ్మక్కై కాజేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Lokesh) ఆరోపించారు. జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవటంతో పాటు నిజమైన హక్కుదారులైన గిరిజనులకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర విజిలెన్స్ కమిషనర్​ (Central Vigilance Commissioner)కు లేఖ (Letter) ద్వారా ఫిర్యాదు చేశారు. అక్రమాలకు సంబంధించి స.హ.చట్టం ద్వారా సేకరించిన వివరాలతో పాటు క్షేత్ర‌స్థాయి పర్యటనలో త‌న దృష్టికి వ‌చ్చిన వివరాలను ఫిర్యాదుకు జత చేశారు. బహుళార్థసార్ధక ప్రాజెక్టు పోలవరం నిర్మాణంలో భాగంగా లక్షమందికిపైగా ప్రజలు నిర్వాసితులుగా మారారని విజిలెన్స్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వీరిలో అత్యధికులు గిరిజనులేనన్న లోకేశ్.., ప్రతీ బాధిత కుటుంబానికి పరిహారం ప్యాకేజీ ఉన్నప్పటికీ వైకాపా నేతలు అధికారులతో కుమ్మక్కై నకిలీ డీ ఫారాలు (Duplicate D-forms), అడంగళ్ రికార్డులు సృష్టించి పరిహారం మొత్తాన్ని కాజేస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటి వరకూ దాదాపు నకిలీ డీ ఫారాలతో 12 మంది రూ.10 లక్షల నుంచి రూ.52 లక్షల మేర పరిహారం పొందారని వెల్లడించారు. ఈ మెుత్తం అవినీతి విలువ రూ.3 కోట్ల వరకూ ఉంటుందన్నారు. సమస్యపై ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితమూ లేదన్నారు. అస‌లైన లబ్ధిదారులు మాత్రం ప‌రిహారం దక్కక‌, పున‌రావాస కాల‌నీల్లో సౌక‌ర్యాలు లేక న‌ర‌క‌యాత‌న పడుతున్నారు. ఈ తరహా అక్రమాలు కె.కొత్తగూడెం గ్రామంతో పాటు ఇతర గ్రామాల్లోనూ పెద్ద స్థాయిలో జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నతాధికారులు సైతం తదుపరి పరిశీలన లేకుండా అనర్హులకు పెద్దమొత్తంలో పరిహారం చెల్లించారన్న లోకేశ్.., మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. నిజమైన హక్కుదారులైన ఆదివాసీలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

CM Jagan: వైద్యారోగ్యశాఖలో 14,200 పోస్టులు.. భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.