ETV Bharat / city

లైవ్​ అప్​డేట్స్​: హకీంపేట్ విమానాశ్రయానికి కల్నల్ సంతోష్ పార్థివదేహం

author img

By

Published : Jun 17, 2020, 11:24 AM IST

Updated : Jun 17, 2020, 8:25 PM IST

live-updates
live-updates

19:33 June 17

హకీంపేట్​కు కల్నల్ పార్థివదేహం

  • హైదరాబాద్​లోని హకీంపేట్ విమానాశ్రయానికి కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం
  • విమానాశ్రయంలో కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి సైనిక వందనం
  • కల్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహానికి గవర్నర్‌ తమిళిసై నివాళులు
  • కల్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహానికి మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి నివాళులు
  • కల్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహానికి ఎంపీ రేవంత్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, సీపీ సజ్జనార్ నివాళులు
  • కాసేపట్లో సూర్యాపేటకు కల్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహం తరలింపు
  • ప్రత్యేక వాహనంలో కల్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహం తరలించనున్న అధికారులు
  • రేపు సూర్యాపేట నుంచి కేసారం వరకు అంతిమయాత్ర
  • అంతిమయాత్ర కోసం ప్రత్యేక వాహనం సిద్ధం చేసిన అధికారులు
  • రేపు కేసారంలోని స్వస్థలంలో కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు
  • రేపు ఉదయం 8 గం.కు సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు

16:00 June 17

హకీంపేట్ విమానాశ్రయానికి కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం

  • కాసేపట్లో హకీంపేట్ విమానాశ్రయానికి కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం
  • కల్నల్‌ సంతోష్ బాబు పార్థివదేహానికి నివాళులు అర్పించనున్న తెలంగాణ గవర్నర్ తమిళి సై
  • నివాళులు అర్పించనున్న మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్మీ అధికారులు

15:21 June 17

సంతాపం తెలిపిన కుంతియా

  • కల్నల్ సంతోష్‌బాబు వీరమరణం పట్ల సంతాపం తెలిపిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌.సి.కుంతియా

15:04 June 17

'దేశం ఎన్నటికీ మరిచిపోదు'

  • కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పట్ల సంతాపం ప్రకటించిన రాహుల్ గాంధీ
  • ఈ మేరకు కల్నల్‌ సంతోష్ బాబు సతీమణికి లేఖ రాసిన రాహుల్ గాంధీ
  • కల్నల్ సంతోష్ బాబు త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరిచిపోదు: రాహుల్‌గాంధీ
  • కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి జాతియావత్తూ అండగా ఉంటుంది: రాహుల్‌గాంధీ

14:44 June 17

కాసేపట్లో హైదరాబాద్‌కు కల్నల్ భౌతికకాయం

  • 4 గంటలకల్లా హైదరాబాద్​కు కల్నల్​ సంతోష్​బాబు పార్థివదేహం

12:04 June 17

కల్నల్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తమ్‌ కుమార్‌

సూర్యాపేటలో కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ పరామర్శించారు. కల్నల్‌ సంతోష్‌బాబు తల్లిదండ్రులను ఓదార్చారు.

12:03 June 17

తెలంగాణకు చేరుకోనున్న కల్నల్​ సంతోష్​బాబు పార్థివదేహం

  • మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణకు కల్నల్​ సంతోష్​బాబు పార్థివదేహం చేరుకోనుంది.

11:22 June 17

  • దిల్లీ నుంచి శంషాబాద్‌ చేరుకున్న కల్నల్‌ సంతోష్ బాబు భార్య, పిల్లలు
  • సూర్యపేటకు రోడ్డు మార్గాన బయలుదేరిన కల్నల్‌ సంతోష్‌ బాబు భార్య, పిల్లలు

11:21 June 17

LIVE

LIVE UPDATES
లైవ్​ అప్​డేట్స్​: కల్నల్‌ కుటుంబ సభ్యులకు బంధువుల పరామర్శ
  • సూర్యాపేట: కల్నల్‌ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న బంధువులు
  • కల్నల్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు రానున్న పలువురు, ప్రముఖులు
  • కల్నల్‌ ఇంటి పరిసరాల్లో క్రిమిసంహారిణి పిచికారీ చేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది
Last Updated :Jun 17, 2020, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.