జాతీయ రహదారిపై మహిళ వీరంగం.. చివరకు ఏమైందంటే?
Published on: May 12, 2022, 8:22 PM IST

జాతీయ రహదారిపై మహిళ వీరంగం.. చివరకు ఏమైందంటే?
Published on: May 12, 2022, 8:22 PM IST
కృష్ణా జిల్లాలో చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ఓ మహిళ హల్చల్ చేసింది. అటుగా వెళ్తున్న ప్రయాణికుల పట్ల అసభ్యంగా దూషణలకు దిగింది.
కృష్ణా జిల్లాలోని చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ఓ మహిళ వీరంగం సృష్టించింది. ప్రయాణీకులను నోటికొచ్చిన మాటలతో దూషించింది. కారులో వెళ్తున్న ప్రయాణీకుల పట్ల అసభ్యంగా ప్రవర్తించింది. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆమెను.. గన్నవరం గాంధీబొమ్మ కూడలిలో పోలీసులకు అడ్డుకున్నారు. ఆమె వివరాలు సేకరిస్తున్న పోలీసులపై కూడా పరుష పదజాలంతో దూషణలకు దిగింది. దీంతో సదరు మహిళను స్టేషన్కి తరలించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.
ఇదీ చదవండి: విశాఖ వధువు మృతికేసు.. పోలీసులు ఏమన్నారంటే?

Loading...