ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఇందిరా గాంధీ జయంతి

author img

By

Published : Nov 19, 2020, 3:57 PM IST

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్​ నాయకులంతా ఇందిర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Indira Gandhi Jayanti celebrations
ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

విశాఖ జిల్లా

మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ జయంతిని విశాఖ జిల్లా చీడికాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇందిర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాలన నేటి తరానికి ఆదర్శనీయమని...పీసీసీ ప్రధాన కార్యదర్శి అన్నారు.

అనకాపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనకాపల్లి కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఐఆర్.గంగాధర్ మాట్లాడుతూ బ్యాంకుల జాతీయకరణ, పేద బడుగు బలహీన వర్గాలకు లక్షల ఎకరాల సాగు భూముల పంపిణీ ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇందిరాగాంధీ చేపట్టారని కొనియాడారు.

ఇందిరమ్మ రాజ్యం...ఇంటింటా సౌభాగ్యమని పాయకరావుపేట కాంగ్రెస్ ఇన్​చార్జ్ తాళ్ళూరి విజయ్ కుమార్ అన్నారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధి 103వ జయంతిని పాయకరావుపేట నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. సూర్య మహాల్ సెంటర్​లో గల ఇందిరా గాంధీ విగ్రహానికి ఆ పార్టీ నాయకులు తాళ్ళూరి విజయ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు దుప్పట్లు, మిఠాయిలు పంచి పెట్టారు.

గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఏపీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి, జిల్లా నాయకుడు లింగంశెట్టి ఈశ్వరరావు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇదీ చదవండి:

సీఎం జగన్ స్థానిక ఎన్నికలు జరగనివ్వరు: జేసీ దివాకర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.