ETV Bharat / city

EWS Reservations: విద్యాసంస్థల్లో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్‌ కోటా అమలు: ఉన్నత విద్యామండలి

author img

By

Published : Aug 2, 2021, 9:49 PM IST

విద్యాసంస్థల్లో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్‌ కోటా అమలవుతోందని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. అన్ని సెట్‌ల ప్రవేశాల్లో ఈ ఏడాదీ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్ కోటా అర్హులు అడ్మిషన్ల వేళ తమ వివరాలు చెప్పాలని తెలిపింది.

Implementation of quota for EWS reservation in educational institutions
విద్యాసంస్థల్లో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్‌ కోటా అమలు

రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లోనూ అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ల కోటా అమలు అవుతోందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టుల అడ్మిషన్లలోనూ అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసినట్లు ఉన్నత విద్యా మండలి తెలియజేసింది. అడ్మిషన్ల సమయంలో ఈడబ్ల్యూఎస్ కోటాకు విద్యార్థులు తమ వివరాలను తెలియచేయాలని ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

LOK SABHA: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదు: కేంద్రం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.