ETV Bharat / city

ప్రభుత్వం నిద్రపోతోంది, ప్రజలను గాలికి వదిలేసింది: తెలంగాణ హైకోర్టు

author img

By

Published : Jul 20, 2020, 5:30 PM IST

తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షలు, సమాచారం వెల్లడి తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

high court hearing on corona cases in telangana
high court hearing on corona cases in telangana

పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ ఒక్కటి కూడా అమలు కావడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దిల్లీ, ఏపీ వంటి రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో రాష్ట్రం చాలా వెనుకబడి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఓ వైపు కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని, ప్రజలను గాలి వదిలేసిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బులిటెన్‌, బెడ్ల వివరాలపై అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. కరోనా విషయంలో హైకోర్టు అభినందించిందని బులిటెన్‌లో పేర్కొనడంపై.. ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఓ వైపు మొట్టికాయలు వేస్తుంటే అభినందించినట్లు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఇదీ చదవండి: తెలంగాణ: నిమ్స్​లో కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్​ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.