ETV Bharat / city

TS Rain News: మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం !

author img

By

Published : Sep 20, 2021, 9:00 PM IST

తెలంగాణాను మళ్లీ వర్షం ముంచెత్తుతోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్​లో గంటపాటు కురిసిన వర్షం...జనజీవనాన్ని స్తంభింపజేసింది. రానున్న మూడు గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని...నగరవాసులు ఇళ్లలోనే ఉండాలని వాతావరణశాఖ సూచించింది.

మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం
మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు (Heavy Rainfall Alert) పడుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలను జోరువాన (Heavy Rainfall Alert) ముంచెత్తుతోంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గంటనుంచి వర్షం ఎడ తెరపిలేకుండా కురిసింది. హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. బహదూర్‌పురా నుంచి కిషన్‌బాగ్ వెళ్లే దారిని వరదనీరు (rain flood) ముంచెత్తింది. మోకాళ్ల లోతు నీరు చేరడంతో పాదచారులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముషీరాబాద్, భోలక్‌పూర్‌, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, రామ్‌నగర్, కవాడిగూడ, ఇందిరాపార్క్ ప్రాంతాల్లో వర్షం (Heavy Rainfall Alert) కురిసింది.

దోమలగూడ, విద్యానగర్, అడిక్‌మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rainfall Alert) కురిసింది. ఛత్రినాక కందికల్ గేట్ వెళ్లే రహదారిలో భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. యకుత్‌పురాలో నాలా పొంగటంతో రోడ్​పై నీరు భారీగా చేరింది. చంద్రాయణ్‌గుట్ట నుంచి హష్మబాద్ వెళ్లే దారిలో వాహనాలు నీటిలో ఆగిపోయాయి.

హైదరాబాద్​లో గంటపాటు భారీ వర్షం (Heavy Rainfall Alert) కురిసింది. రానున్న మూడు గంటల్లో పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) వెల్లడించింది. మేడ్చల్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాలకు భారీ వర్ష సూచన (Heavy Rainfall Alert) ఉందని... నగరవాసులు ఇళ్లలోనే ఉండాలని విపత్తుల శాఖ సూచించింది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలన్న విపత్తుల శాఖ... సహాయ చర్యల కోసం నెం. 040-2955 5500కు ఫోన్‌ చేయాలని సూచించింది.

మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం

ఇదీ చూడండి: ముక్కులో విస్కీ.. వైరస్​కు ఇదే సరైన చికిత్స!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.