ETV Bharat / city

ప్రమాణ స్వీకరణ ప్రాంగణం పునరుద్ధరణ

author img

By

Published : May 30, 2019, 8:06 AM IST

Updated : May 30, 2019, 9:11 AM IST

విజయవాడలో అర్థరాత్రి గాలివాన బీభత్సం

విజయవాడ నగరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. జగన్‌ ప్రమాణ స్వీకారం చేసే మైదానంలో వేదిక పైకప్పు పాక్షికంగా దెబ్బతింది.

విజయవాడలో అర్థరాత్రి గాలివాన బీభత్సం

బుధవారం అర్ధరాత్రి భీకర గాలులతో కూడిన వర్షం విజయవాడలో బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు నగరంలో కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వైకాపా నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పలు చోట్ల చిరిగిపోయాయి. జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో వేదిక పైకప్పు పాక్షికంగా దెబ్బతింది. వేదికపైన వేసిన పరదాలు పూర్తిగా ఎగిరిపోయాయి. వర్షం కారణంగా మైదానమంతా బురదమయంగా మారింది. రాత్రి 1.30 గంటలకు గాలులు, వర్షం తగ్గగానే వైకాపా నేతలు, అధికారులు అక్కడికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. గాలి వేగానికి చాలాచోట్ల హోర్డింగులు కిందపడ్డాయి. రహదారుపై వాహనాలు నడపలేని పరిస్థితి ఎదురైంది. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.

ఇదీ చదవండీ...

నేడు సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం

Intro:ఈదురు గాలులకు విద్యుత్ నియంత్రికలు నేల కులాయి....

నార్పల మండల కేంద్రంలోని నార్పల, తాడిపత్రి , ధర్మవరం,అనంతపురం వెళ్లే రహదారిపై రాత్రి విసిన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు , చెట్లు రోడ్డు పై పడ్డాయి .

విద్యుత్ నియంత్రికలు కూడా నేల కులాయి. ఇంటి పైకప్పు రేకులు రోడ్ల మీద పడ్డాయి.

అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం వైపు వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడింది..


Body:శింగనమల


Conclusion:కంట్రిబ్యూటర్ :ఉమేష్
Last Updated :May 30, 2019, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.