ETV Bharat / city

నాడు - నేడు పనులను నెలాఖరులోగా పూర్తిచేయాలి: మంత్రి సురేష్

author img

By

Published : Mar 17, 2021, 9:22 AM IST

నాడు - నేడు, మన బడి పనులను.. ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తి చేయకుండా అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

education minister orders to complete nadu nedu works
నాడు-నేడు పనులను నెలాఖరులోగా పూర్తిచేయాలి: ఆదిమూలపు సురేష్

విద్యా రంగంలో అమలు చేస్తున్న మన బడి, నాడు నేడు మొదటి దశ పనులు.. ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయాల్సిందేనని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులకు ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తి చేయడానికి రోజువారీ సమీక్షలు నిర్వహించుకోవాలన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయకుండా అలసత్వం వహిస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.

మున్సిపల్, హౌసింగ్, గిరిజన సంక్షేమం, సర్వశిక్షా అభియాన్ శాఖల ఉన్నతాధికారులతో.. సమీక్షించారు. ఆ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన నాడు నేడు పనుల ప్రగతి తెలుసుకున్నారు. ఫ్యాన్లు, స్మార్ట్ టీవీలు, ఫర్నీచర్, గ్రీన్ బోర్డుల ఏర్పాటుతో పాటు తాగునీటి కల్పన, పారిశుద్ధ్య పనుల నిర్వహణ పనుల వివరాలు ఆరా తీశారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సాగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏప్రిల్ నుంచి రెండో విడత పనులు చేపడతామని తెలిపారు.

ఇదీ చదవండి:

నవయుగ, అరబిందో కన్సార్షియానికి 'రామాయపట్నం' పనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.