ETV Bharat / city

DGP: సైబర్ నేరాల కట్టడికి పటిష్ఠ వ్యూహం: డీజీపీ గౌతంసవాంగ్

author img

By

Published : Jan 18, 2022, 3:45 AM IST

DGP:సైబర్ నేరాలను నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో సోషల్ మీడియా ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు డీజీపి గౌతమ్ సవాంగ్ ఓ ప్రకటనలో తెలిపారు.సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టూల్స్, డిస్క్ ఫోరెన్సిక్ టూల్స్ ,మొబైల్ ఫోరెన్సిక్ టూల్స్ ,పాస్ వర్డ్ రికవరీ టూల్స్ , సీడీఆర్ ఎనాలిసిస్ టూల్స్, ఇమేజ్ ఎన్ హాన్స్ మెంట్ టూల్స్, ప్రాక్సీ సర్వర్ ఐడెంటిటి టూల్స్, సోషల్ మీడియా టూల్స్ లను ల్యాబ్స్ ల్లో అందుబాటులో ఉంచుతామన్నారు.

డీజీపీ గౌతంసవాంగ్
డీజీపీ గౌతంసవాంగ్

DGP: సైబర్ నేరాలను నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో సోషల్ మీడియా ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు డీజీపి గౌతమ్ సవాంగ్ ఓ ప్రకటనలో తెలిపారు.సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టూల్స్, డిస్క్ ఫోరెన్సిక్ టూల్స్ ,మొబైల్ ఫోరెన్సిక్ టూల్స్ ,పాస్ వర్డ్ రికవరీ టూల్స్ , సీడీఆర్ ఎనాలిసిస్ టూల్స్, ఇమేజ్ ఎన్ హాన్స్ మెంట్ టూల్స్, ప్రాక్సీ సర్వర్ ఐడెంటిటి టూల్స్, సోషల్ మీడియా టూల్స్ లను ల్యాబ్స్ ల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఒక్కొక్క ల్యాబ్ లో ఒక ఎస్సైతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు. బిటెక్ విద్యార్హత కలిగి సైబర్ నేరాలపై పట్టు ఉన్న వారిని ఎంపిక చేశామని తెలిపారు. ప్రతి జిల్లాకు సాంకేతిక పరంగా న్యాయ సలహాల కోసం సైబర్ లీగల్ అడ్విజర్, సైబర్ నిపుణులను నియమిస్తామన్నారు. డీజీపీ గౌతం సవాంగ్ ఆన్ లైన్ ద్వారా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి మొదటి విడత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మొదటి విడతలో భాగంగా పీటీసీ విజయనగరంలో 100, పీటీసీ ఒంగోలులో 100, పీటీసీ అనంతపురంలో 100 మందికి శిక్షణ పొందుతారు. ఎంపిక చేసిన 20,000 మందికి విడతలవారీగా సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ, సోషల్ మీడియా నేరాల నియంత్రణపై శిక్షణ ఇస్తామన్నారు. ల్యాబ్ లు ఏర్పాటు వల్ల సైబర్ నేరాల దర్యాప్తు వేగవంతమవుతుందని డీజీపి తెలిపారు. నిందితులకు శిక్ష పడేందుకు సాంకేతిక ఆధారాలు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 1,551 మంది ప్రొ ఫైల్ లను గుర్తించి వారందరి పైన సైబర్ బుల్లి షీట్స్ ఓపెన్ చేసి వారి కదలికల పై నిఘా ఉంచామని డీజీపీ వెల్లడించారు.

ఇదీ చదవండి:

"చింతామణి" నాటకంపై.. ప్రభుత్వ నిషేధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.