ETV Bharat / city

రేపటి నుంచి అమరావతిలో దళిత చైతన్య యాత్రలు

author img

By

Published : Apr 8, 2021, 3:39 PM IST

dalitha chaitanya yatralu in amaravati, dalitha bahujana front national secretary melam bhagyarao
రేపటి నుంచి అమరావతిలో దళిత చైతన్య యాత్రలు, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి మేళం భాగ్యారావు

రాజధాని ప్రాంతంలో ఏప్రిల్ 9 నుంచి 20 వరకు దళిత చైతన్య యాత్రలు చేపట్టనున్నట్లు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి మేళం భాగ్యారావు మీడియాకు వెల్లడించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని.. విజయవంతం చేయాలని కోరారు.

అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన వారిలో 60 శాతం తమ సామాజిక వర్గం వారే ఉన్నారని.. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి మేళం భాగ్యారావు తెలిపారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 9 నుంచి 20 వరకు రాజధాని గ్రామాల్లో దళిత చైతన్య యాత్రలు చేపట్టనున్నట్లు.. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. దళిత చైతన్య యాత్రలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంతో అమరావతిలో నిర్మాణాలు స్తంభించి.. లక్షలాది మంది వెనుకబడిన వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోయారని భాగ్యారావు ఆరోపించారు. మెరుగైన జీవనాన్ని ఆశించి తమ వ్యవసాయ భూములను రాజధానికి ఇచ్చిన దళితుల ఆశలు అడియాసలు అయ్యాయన్నారు. వెనుకబడిన వర్గాలు 80 శాతం ఉన్న రాజధాని ప్రాంతాన్ని.. పథకం ప్రకారం నిర్వీర్యం చేసేందుకు సీఎం జగన్ కుట్ర పన్నారని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం దళితులకు కొత్త సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా.. ఉన్న వాటినీ రద్దు చేశారని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:

'వైకాపా పాలనలో ప్రతిపక్ష నేతలకు రక్షణ కరవైంది'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.