ETV Bharat / city

పట్టాభిని అరెస్టు చేశారు..మరి దాడి చేసినవారిపై చర్యలేవి?: రామకృష్ణ

author img

By

Published : Oct 21, 2021, 4:11 PM IST

సీపీఐ రామకృష్ణ
సీపీఐ రామకృష్ణ

రాష్ట్రంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర(cpi ramakrishna) కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అనుచిత వ్యాఖ్యల పేరిట పట్టాభిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం.. అతడి కుటుంబ సభ్యులపై దాడి చేసిన వారిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించారు.


రాష్ట్రంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(cpi ramakrishna) అన్నారు. గన్నవరంలో జరిగిన పార్టీ జిల్లా సమితి, శాఖా కార్యదర్శుల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్థికంగా దివాళ తీసిందని విమర్శించారు. ఒకటో తారీఖు రాగానే ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు అప్పు ఎటునుంచి తీసుకుని రావాలా అని ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అనుచిత వ్యాఖ్యల పేరిట పట్టాభిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం.. అతడి కుటుంబ సభ్యులపై దాడి చేసిన వారిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించారు.

అటు ముఖ్యమంత్రి జగన్, ఇటు తెదేపా అధినేత చంద్రబాబు.. వారి నాయకులను కంట్రోల్​లో పెట్టడంలో పూర్తిగా విఫలమైనందునే ఏపీ శాంతి భద్రతలు క్షీణించాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకనైనా రెండు పార్టీలు నేతల సమన్వయంతో రాష్ట్రాభివృద్ధికి పాటు పడేలా కృషి చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు సీపీఐ జిల్లా కమిటీ తయారవుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Governor: గవర్నర్‌ను కలవనున్న తెదేపా నేతలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.