ETV Bharat / city

cm jagan: నాడు-నేడు, జగనన్న విద్యాకానుకపై సీఎం సమీక్ష

author img

By

Published : Jul 7, 2021, 12:42 PM IST

విద్యాశాఖలో నాడు-నేడు, జగనన్న విద్యా కానుకపై సీఎం జగన్(cm jagan) సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు కింద బడులను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ అన్నారు.

cm jagan on vidya kanuka
cm jagan on vidya kanuka

నాడు-నేడు(nadu nedu), జగనన్న విద్యా కానుకపై(jagananna vidya kanuka) సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు సురేష్, తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నాడు-నేడు పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన అనంతరం తీసిన ఫొటోలను ప్రదర్శించాల్సిందిగా ప్రభుత్వం గతంలోనే ఆదేశాలిచ్చింది. మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రామాణిక విధానాన్ని అనుసరించాలని సూచించింది. పథకాన్ని ఇంటర్, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్, ఐటీఐలు, ఇతర వైద్యారోగ్య సంస్థలకూ వర్తింపజేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం అప్పట్లోనే వెల్లడించింది.

జగనన్న విద్యాకానుకపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జగనన్న విద్యా కానుక కిట్‌లో ఒక్కో విద్యార్థికి 3 జతల ఏకరూప దుస్తులు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు ఉంటాయనే విషయం తెలిసిందే. 1 నుంచి 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్క్‌ బుక్స్.. 6 నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగు ఇస్తారు. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి చిన్న సైజు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీని జగనన్న విద్యా కానుక కిట్​లో చేరుస్తూ ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: ఆ క్షణం మృత్యువుదే!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.