ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరిన్ని వైద్య చికిత్సలు.. ఆరోగ్య ఆసరా ఆర్థిక సాయం పెంపు: సీఎం జగన్

author img

By

Published : Jun 13, 2022, 7:06 PM IST

ఆరోగ్య ఆసరా ఆర్థిక సాయం పెంపు
ఆరోగ్య ఆసరా ఆర్థిక సాయం పెంపు ()

ఆరోగ్య శ్రీ పరిధిలో మరిన్ని వైద్య చికిత్సలు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మరింత పారదర్శకంగా ఆరోగ్య శ్రీ పథకం అమలు చేయాలన్నారు. ఆరోగ్య ఆసరా కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు సీఎం వెల్లడించారు.

మరింత పారదర్శకంగా ఆరోగ్య శ్రీ పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. ఆరోగ్య శ్రీ పరిధిలో మరిన్ని వైద్య చికిత్సలు అందించాలన్నారు. ఆరోగ్యశ్రీలో ప్రస్తుతం 2,446 ప్రొసీజర్లు వర్తిస్తున్నాయని అధికారులు చెప్పగా.. అవసరాల మేరకు ప్రొసీజర్ల సంఖ్య పెంచాలని సీఎం సూచించారు. ఈ అంశంపై వారంలోగా ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో గర్భిణులకు సహజ ప్రసవంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులదేనని చెప్పారు. ఆరోగ్య ఆసరా కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రసవం తర్వాత ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేలు ఇవ్వాలన్నారు.

రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపైనా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ పూర్తిగా నియంత్రణలో ఉందని అధికారులు తెలపగా.. వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశారు. ఆసుపత్రుల్లో నాడు - నేడు పనులు, వైద్య కళాశాలల నిర్మాణం, క్యాన్సర్‌ కేర్‌పైనా సీఎం సమీక్ష నిర్వహించారు. మొత్తం 27 వైద్య కళాశాలల్లో క్యాన్సర్‌ నివారణ యంత్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య కళాశాలల్లో 2 చొప్పున లైనాక్‌ యంత్రాలు ఉండేలా చూడాలన్నారు. 3 వైద్య కళాశాలల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్‌ నివారణపై సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పెట్టాలని ప్రతిపాదించారు. విశాఖ, తిరుపతి, గుంటూరులో ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

"ప్రసవం తర్వాత ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేలు ఇవ్వాలి. సహజ ప్రసవంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులదే. ఆరోగ్యశ్రీ పరిధిలో మరిన్ని వైద్య చికిత్సలు. అవసరాల మేరకు ప్రొసీజర్ల సంఖ్య పెంచాలని సీఎం ఆదేశం. వారంలో ప్రతిపాదనలు ఇవ్వాలి. మరింత పారదర్శకంగా ఆరోగ్య శ్రీ పథకం. కొవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి. మొత్తం 27 వైద్య కళాశాలల్లో క్యాన్సర్‌ నివారణ యంత్రాలు. వైద్య కళాశాలల్లో 2 చొప్పున లైనాక్‌ యంత్రాలు ఉండేలా చూడాలి. 3 వైద్య కళాశాలల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు నిర్ణయం. క్యాన్సర్‌ నివారణపై సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పెట్టాలని ప్రతిపాదన. విశాఖ, తిరుపతి, గుంటూరులో ఏర్పాటుకు ప్రతిపాదన." - జగన్, సీఎం

ఇవీ చూడండి

"కరగని నైరుతి మేఘం.." ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా..?

ఈడీ కార్యాలయానికి రాహుల్​.. రెండో రౌండ్​ విచారణ

'జాబ్‌ క్యాలెండర్‌ హామీ ఏమైంది'.. సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.