ETV Bharat / city

Cheddi gang Arrest : చెడ్డీగ్యాంగ్ చిక్కిన విధానం ఎట్టిదంటే..!

author img

By

Published : Dec 18, 2021, 4:36 PM IST

Updated : Dec 18, 2021, 6:14 PM IST

Cheddi gang Arrest : కరుడుగట్టిన చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు పోలీసులకు చిక్కారు. రెండు ముఠాల్లోని ముగ్గురిని అరెస్టు చేశారు. గుజరాత్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే ఓ తెగకు చెందిన వారు.. వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు వీరిని పట్టుకున్నారు.

Cheddi gang Arrest
చిక్కిన చెడ్డీగ్యాంగ్.. ముగ్గురు అరెస్ట్...

చిక్కిన చెడ్డీగ్యాంగ్.. ముగ్గురు అరెస్ట్...

Cheddi gang Arrest : కరుడుగట్టిన చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు ముఠాలకు చెందిన ముగ్గురిని పట్టుకున్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే ఓ తెగకు చెందిన వారు వివిధ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు వీరిని పట్టుకోగలిగారు.

కృష్ణా, గుంటూరు జిల్లా వాసులకు కంటి మీద కునుకులేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో జరిగిన చోరీ ఘటనా స్థలంలో దొరికిన వేలిముద్ర సాయంతో పోలీసులు దర్యాప్తు చేశారు. గుజరాత్, మధ్యప్రదేశ్‌ సరిహద్దులోని ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు అనుమానించి ఆ దిశగా దృష్టి పెట్టారు. దొంగలు సెల్‌ఫోన్లు వాడి ఉంటారా? అన్న కోణంలో విస్తృతంగా దర్యాప్తు జరిపారు. ప్రధానంగా విజయవాడ రైల్వేస్టేషనుకు ఈ రెండు రాష్ట్రాల రైళ్లు వచ్చిన సమయాలలో అక్కడి సెల్‌టవర్‌ డంప్‌ను సేకరించారు. ఘటనా స్థలాల్లోని డంప్‌నూ తీసుకున్నారు. దాదాపు లక్ష కాల్స్‌ వచ్చాయి.

వీటిని వడపోసి చూస్తే.. రెండు నెంబర్లు అనుమానాస్పదంగా కనిపించాయి. ఇవి ఈ ముఠా గుజరాత్‌ నుంచి బయలుదేరే రోజే యాక్టివేట్‌ చేయించుకున్నట్లు గుర్తించారు. ఈ నెంబర్ల నుంచి ఎక్కడికి కాల్స్‌ వెళ్తున్నాయి? ఎవరెవరు వీటికి చేస్తున్నారు? అన్నది డంప్‌ విశ్లేషణలో పోలీసులు బయటకు తీశారు. ఈ రెండు నెంబర్ల నుంచి గుజరాత్‌లోని గార్బార్డ్‌లోని ఓ ఫోన్‌కు తరచూ కాల్స్‌ వెళ్లినట్లు తేలింది. ఈ నెంబర్లకు సంబంధించి కాల్‌ డేటా రికార్డ్స్‌ను తెప్పించి వడపోయడంతో పలు ఆధారాలు దొరికాయి.

చెడ్డీ గ్యాంగ్‌ విజయవాడ పాల ఫ్యాక్టరీ సమీపంలో దొంగతనం చేసి.. గుంటూరు జిల్లా తెనాలి వెళ్లారని పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండు రోజుల పాటు అక్కడి రైల్వే స్టేషనులోనే ప్లాట్‌ఫారాలపై ఉన్నట్లు తెలిపారు. అనంతరం గుంటుపల్లిలో దొంగతనం జరిగిన రోజు మళ్లీ విజయవాడ వచ్చి రైల్వేస్టేషనులోని ప్లాట్‌ఫారంపై తలదాచుకున్నారు. తాడేపల్లి ప్రాంతాల్లో చేసిన రోజు అక్కడి రైల్వే వంతెన కింద ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

విజయవాడ పోలీసులు.. చెడ్డీ గ్యాంగ్‌ను నిర్ధరించుకునేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేశారు. గుజరాత్‌ పోలీసుల సమాచారంతోపాటు, ప్రైవేటు వ్యక్తుల ద్వారా కూడా వివరాలు తెప్పించుకున్నారు. దాహోద్‌ ప్రాంతంలో దొంగలు ఎవరెవరు ఉన్నారు? స్థానికంగా లేని వారు ఎవరు? అన్న వివరాలు సేకరించారు. ఇక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను గుజరాత్‌ పోలీసులకు పంపించి ఆరా తీశారు. మొత్తం పది మంది స్థానికంగా లేనట్లు రూఢీ చేసుకున్నారు. విజయవాడ నుంచి దొంగలు గుజరాత్‌ వెళ్లిపోయినట్లు వారి సెల్‌ లొకేషన్‌ బట్టి తెలుసుకుని ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించారు. అలా అక్కడ వారు రైలు దిగగానే పట్టుకోగలిగారు. మిగితా ఏడుగురి కోసం గాలిస్తున్నారు. ముఠా సభ్యుల నుంచి డబ్బు, వెండిసామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

చెడ్డీ గ్యాంగ్‌ వారి స్వగ్రామాల్లో కూలీ పనులు చేసుకుని పొట్ట నింపుకుంటారు. పనులు లేని సమయాల్లో చోరీలకు పాల్పడుతురాని పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని.. దొంగతనాలు చేస్తుంటారని తెలిపారు.

ఇదీ చదవండి : Thief Cases accused arrested in nellore: ఒక్కటి కాదు​.. ఒక్కడే వంద ఇళ్లకు కన్నం!

Last Updated :Dec 18, 2021, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.