ETV Bharat / city

మేము అధికారంలో ఉంటే.. ఈ పాటికి పోలవరం ఉరకలెత్తేది: చంద్రబాబు

author img

By

Published : Mar 4, 2022, 3:31 PM IST

CBN on Polavaram: తెదేపా అధికారంలో ఉంటే.. పోలవరం ఈ పాటికి ఉరకలెత్తేదని.. పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పోలవరంపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేసి.. పైసా కూడా నిరూపించలేకపోయారని మండిపడ్డారు.

ChandraBabu comments on Polavaram project
తాము అధికారంలో ఉంటే పోలవరం ఉరకలెత్తేది: చంద్రబాబు

CBN on Polavaram: పోలవరంపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేసి.. పైసా కూడా నిరూపించలేకపోయారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తాము అధికారంలో కొనసాగుంటే.. ఈపాటికి పోలవరం ఉరకలెత్తేదని పేర్కొన్నారు.

పోలీసులు ఖబడ్దార్, చట్టాన్ని కాపాడకుండా ఉల్లంఘిస్తే గౌతం సవాంగ్ ఏమయ్యాడో ఆలోచన చేయాలని హితవు పలికారు. కార్యకర్తలు.. ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా సమన్వయం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తామని వెల్లడించారు.

మదనపల్లి నియోజకవర్గానికి ఇంచార్జి ఎవరు..?
చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గానికి పార్టీ ఇంచార్జిగా ఎవరిని నియమించాలనే విషయంపై.. తెదేపా సీనియర్ నేతలు సమావేశం కానున్నారు. గురువారం రాత్రి మదనపల్లి నేతలతో సుదీర్ఘంగా చరించిన చంద్రబాబు.. నియోజకవర్గంలో ఉన్న గ్రూపులకు చెక్ పెట్టాలని.. సీనియర్‌ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డికి సూచించారు.

నియోజకవర్గంలో దమ్మలపాటి రమేష్, బోడపాటి శ్రీనివాస్ గ్రూపులుగా కార్యకర్తలు విడిపోయాయి. ఇద్దరూ కలిసి పనిచేస్తే.. ఇంచార్జి ఎవరికి ఇవ్వాలనేది తాను నిర్ణయిస్తానని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. రెండు గ్రూపుల మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దే పనిలో సీనియర్‌ నేతలు నిమగ్నమయ్యారు.

ఇదీ చదవండి:
Polavaram Visit: పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తాం: షెకావత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.