హత్యకేసులో సాక్షులను బెదిరిస్తున్నారు.. డీజీపీకి చంద్రబాబు లేఖ

author img

By

Published : Jun 25, 2022, 11:28 AM IST

Updated : Jun 25, 2022, 12:06 PM IST

చంద్రబాబు
చంద్రబాబు ()

CBN LETTER TO DGP: కటారి అనురాధ దంపతుల హత్యకేసు విచారణలో పోలీసులు జాప్యం చేస్తున్నారని.. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. హత్యకేసులో కీలక సాక్షి అయిన సతీష్​ వివరాల కోసం ప్రసన్న అనే వ్యక్తిని వేధించి.. ప్రసన్న సోదరుడు పూర్ణ ఇంటిపై దాడిచేశారని.. సాక్షులను బెదిరిస్తున్న స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

CBN LETTER TO DGP: కటారి అనురాధ దంపతుల హత్యకేసు విచారణలో.. పోలీసులు జాప్యం చేస్తున్నారని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరినా.. చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కీలక సాక్షి అయిన సతీష్​ వివరాల కోసం ప్రసన్న అనే వ్యక్తిని వేధించి.. ప్రసన్న సోదరుడు పూర్ణ ఇంటిపై దాడిచేశారని పేర్కొన్నారు.

పోలీసులే పచ్చిగడ్డి తెచ్చి.. పూర్ణ ఇంట్లో గంజాయి ఉందంటూ అరెస్టు చేశారని ఆక్షేపించారు. అడ్డుకున్న మాజీ మేయర్ హేమలతపై దారుణంగా వ్యవహరించారన్నారు. హేమలతపై జీపు ఎక్కించడం వల్ల తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యిందన్నారు. పూర్ణపై అక్రమ కేసు పెట్టి.. హేమలత పట్ల కర్కశంగా వ్యవహరించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సాక్షులను బెదిరిస్తున్న స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలిని కోరారు. ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగేలా చర్యలు ఉండాలన్నారు.

ప్రజావేదిక కూల్చివేత@3 ఏళ్లు: తన సైకో పాలన ఎలా ఉండబోతోందో ప్రజలకు చెప్పడానికి అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి చేసిన మొట్టమొదటి పని ప్రజావేదిక కూల్చివేత అని దుయ్యబట్టారు. ప్రజావేదిక విధ్వంసానికి నేటితో మూడేళ్లని.. ఈ మూడు సంవత్సరాలలో తన పాలన ఎలా ఉంటుందో జగన్‌ ముందే ప్రజలకు చూపారని ఎద్దేవా చేశారు. డిస్ట్రక్షన్ తప్ప కన్‌స్ట్రక్షన్‌ చేతగాని జగన్ చేసినవన్నీ కూల్చివేతలే అని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధిని, రాష్ట్ర ఆర్థికస్థాయిని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, దళితుల గూడును, యువత భవితను కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారాజధాని అమరావతిని, పోలవరం కలను కూల్చి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. ప్రజావేదిక కూల్చి వికృతానందం పొందిన జగన్.. మూడేళ్లలో కట్టింది మాత్రం శూన్యమని విమర్శించారు. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లోనే పాలన చేస్తూ.. తన వల్ల ఏమీ కాదని.. తనకు ఏమీ రాదని తేల్చి చెప్పేశారన్నారు. కూల్చడం కంటే నిర్మించడం ఎంత కష్టమైనపనో జగన్ తెలుసుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.

  • డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ చేతగాని జగన్ చేసినవన్నీ కూల్చివేతలే. ఏపీ అభివృద్ధిని కూల్చాడు. రాష్ట్ర ఆర్థికస్థాయిని కూల్చాడు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కూల్చాడు. దళితుల గూడును, యువత భవితను కూల్చాడు. ప్రజారాజధాని అమరావతిని, పోలవరం కలను కూల్చి రాష్ట్రానికి తీరనిద్రోహం చేశాడు.(2/3)

    — N Chandrababu Naidu (@ncbn) June 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

Last Updated :Jun 25, 2022, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.