ETV Bharat / city

ఇకపై అలా చెల్లిస్తే.. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కిందే పరిగణిస్తాం: కేంద్రం

author img

By

Published : Jul 25, 2022, 7:08 PM IST

Central on States Debts: రాష్ట్రాలు ఇతర మార్గాల ద్వారా తీసుకున్న రుణాలకు బడ్జెట్‌ నుంచే అసలు, వడ్డీ చెల్లిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఇకపై అలా చెల్లిస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కిందే పరిగణించాల్సి వస్తుందని ఇప్పటికే హెచ్చరించామని గుర్తు చేసింది. గడిచిన మూడేళ్లలో బహిరంగ మార్కెట్‌ నుంచి రాష్ట్రాలు తీసుకున్న రుణాల జాబితాను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. బహిరంగ మార్కెట్‌ నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకున్న రుణాలు 2022 మార్చి 31 నాటికి రూ.3,98,903కోట్లకు పెరిగినట్టు వెల్లడించారు.

ఇకపై అలా చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కిందే పరిగణిస్తాం
ఇకపై అలా చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కిందే పరిగణిస్తాం

'బహిరంగ మార్కెట్‌' నుంచి గత మూడేళ్లలో రాష్ట్రాలు తీసుకున్న రుణాల జాబితాను కేంద్రం బయటపెట్టింది. 2020 మార్చి నాటికి ఉన్న రుణాలు.., 2022 మార్చి నాటికి పెరిగిన రుణాల వివరాలను పార్లమెంటుకు సమర్పించింది. కాంగ్రెస్‌ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధికశాఖ సమాధానంలో.. బడ్జెటేతర రుణాల వివరాలు లేకుండా కేవలం బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకున్న రుణాలను వెల్లడించింది. ప్రత్యేక కార్పొరేషన్లు, బ్రేవరేజ్ కార్పొరేషన్లు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్- ఎస్పీవీలు, ఇతర సమానమైన సాధనాల ద్వారా రుణాలు తీసుకుని, వాటిని రాష్ట్ర బడ్జెట్‌ నుంచే.. అసలు, వడ్డీ చెల్లిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇకపై అలా చెల్లిస్తే వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కిందే పరిగణించాల్సి వస్తుందని ఇప్పటికే హెచ్చరించినట్లు కేంద్రం చెప్పింది.

వీటితో పాటు పన్నులు, సెస్‌లను తాకట్టు పెట్టి తెచ్చే అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే చూస్తామని స్పష్టం చేసింది. రిజర్వ్‌ బ్యాంకు నివేదిక, బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకున్న రుణాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ అప్పులు 2020 మార్చి 31 నాటికి 3 లక్షల 7 వేల 671 కోట్ల రూపాయలు ఉండగా.. 2021 మార్చి 31 నాటికి 3 లక్షల 60 వేల 333 కోట్లు, 2022 మార్చి 31 నాటికి 3 లక్షల 98 వేల 903 కోట్లకు చేరినట్లు వెల్లడైంది. అత్యధికంగా బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పులు పొందిన రాష్ట్రాల్లో తమిళనాడు అగ్రభాగంలో ఉండగా.. ఉత్తరప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.