ETV Bharat / city

ప్రపంచ క్యాన్సర్​ దినోత్సవం.. రాష్ట్రంలో తొలిసారి చిన్నపిల్లలకు ఆంకాలజీ సేవలు

author img

By

Published : Feb 4, 2022, 5:44 PM IST

Cancer Awareness Conference in Vijayawada : ప్రపంచ క్యాన్సర్​ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఏవోఐ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు ఆంకాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వైద్యులు తెలిపారు. దేశంలో ఏటా 50 వేల మంది క్యాన్సర్​తో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

aoi doctors
aoi doctors

రాష్ట్రంలో తొలిసారిగా చిన్నపిల్లలకు ఆంకాలజీ సేవలు

Cancer Awareness Conference in Vijayawada : దేశంలో ఏటా 50 వేల మంది క్యాన్సర్​తో ప్రాణాలు కోల్పోతున్నారని.. అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ వైద్యులు తెలిపారు. ప్రపంచ క్యాన్సర్​ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

రాష్ట్రంలో తొలిసారిగా ఏవోఐ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు ఆంకాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఏవోఐ మెడికల్‌ డైరెక్టర్​ డాక్టర్​ రాజేష్‌ కోట, చిన్నపిల్లల ఆంకాలజిస్టు డాక్టర్​ వీణ అక్కినేని వెల్లడించారు. క్యాన్సర్​పై పోరాటంలో ప్రతి అడుగులోనూ తాము తోడు ఉంటామని అన్నారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్​పై అవగాహన కలిగి ఉండాలని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య క్యాన్సర్‌ పోరులో అసమానతలు తొలగించేందుకు మూడేళ్ల పాటు అవగాహన కార్యక్రమాలను పెద్ద సంఖ్యలో నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిందన్నారు.

ఇదీ చదవండి

అతని రంగుల కల... ఆమె బంగారు విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.