ETV Bharat / city

'వినాయక చవితికి ఆటంకాలు కలిగించొద్దు'

author img

By

Published : Aug 17, 2020, 1:50 PM IST

BJP state vice-president and Nehru Yuva Kendra national vice-chairman Vishnuvardhan Reddy
భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి

వినాయక చవితి పండుగకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించొద్దని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్​రెడ్డి కోరారు. ప్రజలు సామూహికంగా జరుపుకొనే చిన్నచిన్న పండుగల విషయంలో అనేక చోట్ల పోలీసులు, ఇతర అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు.

వినాయక చవితి.. సమాజంలో అన్ని వర్గాల ప్రజలను కలిపి సామాజిక చైతన్యాన్ని కలిగించే పండుగ అని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్​రెడ్డి అన్నారు. పండుగలను, ప్రజలను ప్రభుత్వం మత, ఓటు బ్యాంకు రాజకీయాలతో చూడకూడదని హితవు పలికారు. వినాయక చవితి మతాలకు సంబంధించిన అంశం కాదని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితిని మతం కోణంలో చూస్తున్నట్లుందని, ఈ విషయంలో ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించుకునే హక్కును అధికారులు హరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణం హిందుమత పెద్దలు, స్వామీజీలు, మఠాధిపతులతో చర్చించాలని విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి: ఏపీ ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్​ చేస్తోంది...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.