ETV Bharat / city

Somu Veerraju on YSRCP: "ఆ పథకాల పేర్లు మార్చకపోతే.. మేమే మార్చేస్తాం"

author img

By

Published : Jan 5, 2022, 2:02 PM IST

Updated : Jan 5, 2022, 5:18 PM IST

Somu Veerraju on Welfare Schemes Names: కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన పథకాలకు.. ప్రధాని మోదీ పేరు పెట్టాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఆ పథకాల పేర్లు మార్చకపోతే.. తామే మార్చేస్తామని అన్నారు. అన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వానివేనని.. ఈ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వానిధులు లేవని స్పష్టం చేశారు.

somu veerraju
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

Somu Veerraju on YSRCP: కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన పథకాలకు.. ప్రధాని మోదీ పేరు పెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. పేర్లు మార్చకపోతే భాజపా రాష్ట్ర శాఖే రంగంలోకి దిగి మారుస్తుందని చెప్పారు. గుంటూరు జిల్లా బాపట్లలో బాపట్ల పార్లమెంట్ పరిధిలోని కార్యకర్తల శిక్షణలో శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

అన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వానివేనని.. పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వానిధులు లేవని సోము వీర్రాజు అన్నారు. రైతు భరోసా కేంద్రాలకు మోదీ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ దిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులను కలిశారని.. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవేను కేంద్ర ప్రభుత్వమే చేపట్టిందన్నారు.

వైకాపాకు.. జిన్నా పేరు ముద్దా?
Training camp for BJP Activists at Bapatla: గుంటూరులో జిన్నా పేరు తొలగించి.. ఆ టవర్​రు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దేశ విచ్ఛిన్ననికి కారణమైన జిన్నా పేరు మారిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. వైకాపాకు జిన్నా పేరు.. ముద్దా? అని ప్రశ్నించారు. అలాగే.. పోలవరానికి శ్రీరామపాద సాగర్, హైదరాబాద్​లో విమానాశ్రయానికి ఎన్టీఆర్​ పేరు తొలగించి రాజీవ్ గాంధీ పేరు పెట్టాలన్నారు.

అమరావతే ఏపీ రాష్ట్ర రాజధాని అని సోము వీర్రాజు అన్నారు. భాజపా కార్యాలయాన్ని అమరావతిలోనే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అమరావతి గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీఎల్​ మోహన్ గౌడ్, బాపట్ల పార్లమెంట్ భాజపా అధ్యక్షుడు మువ్వల వెంకట రమణా రావు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..
Mizoram Governor Haribabu Tour: తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలి: గవర్నర్ హరిబాబు

Last Updated :Jan 5, 2022, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.