ETV Bharat / city

Somu On Capital City: వచ్చేది మా ప్రభుత్వమే.. అద్భుతమైన రాజధాని నిర్మిస్తాం: సోము వీర్రాజు

author img

By

Published : Dec 4, 2021, 7:39 PM IST

Somu On Amaravati: ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనే నైతిక హక్కు సీఎం జగన్‌కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో భాజపాకే చిత్తశుద్ధి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని.. అద్భుతమైన రాజధానిని అమరావతిలో నిర్మిస్తామన్నారు.

వచ్చేది మా ప్రభుత్వమే..అక్కడ అద్భుతమైన రాజధాని నిర్మిస్తాం
వచ్చేది మా ప్రభుత్వమే..అక్కడ అద్భుతమైన రాజధాని నిర్మిస్తాం

వచ్చేది మా ప్రభుత్వమే..అక్కడ అద్భుతమైన రాజధాని నిర్మిస్తాం

Somu Veeraju Comments On Amaravati: అమరావతి రైతుల మహాపాదయాత్రకు ప్రతిరోజూ అడ్డంకులు సృష్టించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయవాడలో నిర్వహించిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఏపీ సర్కార్‌ తీరుపై మండిపడ్డారు. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనే నైతిక హక్కు సీఎం జగన్‌కు లేదని అన్నారు. మహాపాదయాత్రకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉందని.. యాత్ర సాఫీగా సాగేలా చూడడాన్ని తమ పార్టీ నైతిక బాధ్యతగా భావిస్తోందన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని.. అందుకే ఈ ప్రాంతానికి చుట్టుపక్కల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు.

పది వేల కోట్లతో అనంతపురం నుంచి రాజధాని అమరావతి వరకు రహదారి నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ అంగీకరించారని.. త్వరలో రహదారి పనులు ప్రారంభిస్తారన్నారు. ఈనెల 10న విజయవాడలో నిర్మించిన ఫ్లైఓవర్​ను ప్రారంభించేందుకు గడ్కరీ రానున్నట్లు చెప్పారు. అమరావతి రాజధాని అనే ఆలోచనతో దుర్గ గుడి పైవంతెన ప్రారంభించామని సోము అన్నారు.

మరో రెండు ఫ్లైఓవర్లను ఆరు మాసాల ముందే పూర్తి చేశామని... అమరావతి రాజధాని ప్రాంతం నుంచి కృష్ణా కరకట్టమీద నుంచి ఇబ్రహీంపట్నం వరకు వంతెన నిర్మానం జరుగుతోందని తెలిపారు. అమరావతిలోనే ఎయిమ్స్‌ ఆసుపత్రితో పాటు ఎంబీబీఎస్‌ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. రూ.1400 కోట్ల నిధులు ఎయిమ్స్‌కు విడుదల చేశామన్నారు.

మాట తప్పను.. మడమ తిప్పను..ఇక్కడే క్యాపిటల్‌ కడతానని చెప్పిన జగన్‌ మోహన్‌ రెడ్డికి ఇప్పుడు మూడు రాజధానులు కడతానని చెప్పే నైతిక హక్కులేదన్నారు. రాజధాని విషయంలో ఒక్క భాజపాకే కమిట్‌మెంట్‌ ఉందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని.. అద్భుతమైన రాజధానిని అమరావతిలో కడతామని చెప్పారు.

ఇదీ చదవండి

BJP MP GVL On Jagan Govt: రెండున్నరేళ్లలో రూ.1.40 లక్షల కోట్ల అప్పు..దివాలా దిశగా రాష్ట్రం: జీవీఎల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.