BJP LEADERS MEET GOVERNOR: గవర్నర్​ను కలవనున్న భాజపా నేతలు.. తితిదే బోర్డు నియామకంపై ఫిర్యాదు..

author img

By

Published : Sep 20, 2021, 10:02 AM IST

bjp leaders meet governor on ttd council
నేడు గవర్నర్​ను కలవనున్న రాష్ట్ర భాజపా బృంధం ()

భాజపా(bjp) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో ప్రతినిధుల బృందం.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌(Governor Biswabhusan Harichandan)ను కలవనుంది. తితిదే పాలక మండలి(ttd) నూతన సభ్యుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నూతన సభ్యుల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ.. భాజపా ప్రతినిధుల బృందం నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు(bjp complaint to governor over ttd board) చేయనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో ప్రతినిధుల బృందం.. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ప్రస్తుత పరిస్థితులను వివరించనున్నారు.

తితిదే రాజకీయ పునరావాస సంస్థగా మార్చేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వీర్రాజు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో 50 మందిని అదనంగా నియమించడాన్ని భాజపా తప్పుబట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల మేరకు మాత్రమే పాలకమండలి నియామకం జరగాలన్నారు. అదనంగా నియమించిన సభ్యులని వెంటనే తొలగించి దేవస్థానం విశిష్టతను కాపాడాలని గవర్నర్‌ను కోరనున్నారు. తితిదే పాలకమండలి ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని పునరాలోచన చేసుకునేలా గవర్నర్‌ ఆదేశించాలని వినతిపత్రం సమర్పించనున్నారు.

ఇదీ చదవండి..

Venkaiah Naidu on Koya language: కోయ భాషలో బోధనను అభినందించిన ఉపరాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.