ETV Bharat / city

Somu Veerraju: మూలధనం పెంచుకోవడంపై సీఎం జగన్ దృష్టి సారించాలి: సోము వీర్రాజు

author img

By

Published : Feb 2, 2022, 12:38 PM IST

Somu Veerraju comments: శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులను నిర్బంధించే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని.. మూలధనం పెంచుకోవడంపై సీఎం జగన్ దృష్టి సారించాలన్నారు.

సోము వీర్రాజు
somu veerraju press meet

ఉద్యోగులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని.. వారిని నిర్బంధించే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్​ చేశారు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య మాటల యుద్ధం మంచిది కాదని హితవు పలికారు. ముందస్తు నోటీసులు ఇచ్చినా అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం తిప్పలు పడే పరిస్థితి నెలకొందని.. మూలధనం పెంచుకోవడంపై సీఎం జగన్ దృష్టి సారించాలన్నారు. రైల్వే జోన్ విషయంలో ఏపీకి న్యాయం జరుగుతుందని.. పోలవరం విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. గుంటూరులో జిన్నా పేరు తొలగించాలి.. లేదంటే మేమే మారుస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు.

ఇసుక ధర విషయంలో ప్రభుత్వం లెక్కలు అర్థం కావట్లేదు. వేల కోట్లు విలువ చేసే గనులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయి. ఎర్రచందనం అమ్మకంతో రూ.3 వేల కోట్ల అదాయం ఉంది. జగన్ హామీలను అమలు చేయాలంటే ఆదాయాన్ని పెంచాలి. 2 వేల కి.మీ. రోడ్డు నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలి. పెన్నా, కృష్ణా, గోదావరి నదుక అనుంధానం, ఎంఎస్‌ఎంఈల ద్వారా పథకాలు తెస్తే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కొండ ప్రాంతాల అభివృద్ధి పేరుతో పర్వత మాల్ పెట్టారు. సాగర్ మాల్ తరహాలో పర్వత మాల్ రోప్ వే ఏర్పాటు చేయాలి. -సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి : Polavaram: పోలవరానికి ఇలా.. కెన్​-బెత్వాకు అలా

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.