ETV Bharat / city

చంద్రబాబుకు గవర్నర్, సీఎం జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు

author img

By

Published : Apr 20, 2022, 12:54 PM IST

Updated : Apr 20, 2022, 3:47 PM IST

తెదేపా అధినేత చంద్రబాబుకు పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్, జనసేన అధినేత పవన్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చంద్రబాబుకు గవర్నర్, సీఎం జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
చంద్రబాబుకు గవర్నర్, సీఎం జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు

  • Wish you a happy birthday @ncbn garu.

    — YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెదేపా అధినేత చంద్రబాబుకు పలువురు ప్రముఖలు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ ట్వీటర్​లో చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన గవర్నర్ బిశ్వభూషణ్ ఆయనకు..జగన్నాథుడు, వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.

  • ఇక తెలుగువారికి ఆయనంటే ఒక భరోసా.లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం. ఈ రకంగా కోట్లాది మందికి తండ్రి అయ్యారు ఆయన. సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్... ఆయనే మా నాన్న చంద్రబాబు గారు.(2/3)

    — Lokesh Nara (@naralokesh) April 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కోట్ల మందికి అన్నదాత అయ్యారు: చంద్రబాబుకు ఆయన తనయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు దార్శనిక పాలన ద్వారా ఎంతో మంది పేదలు కూడా ఉన్నత చదువులు చదవగలిగారని.. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్లాది మందికి అన్నదాత అయ్యారని పేర్కొన్నారు. సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సూపర్ స్టార్ చంద్రబాబుకు.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

జనసేనాని శుభాకాంక్షలు.. తెదేపా అధినేత చంద్రబాబుకు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: Chandrababu Birthday: 73వ ఏట అడుగుపెట్టిన చంద్రబాబు.. అదే నేటి నిర్ణయం

Last Updated : Apr 20, 2022, 3:47 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.